సమంతకు థాంక్యూ  చెప్పిన అనుపమ.. కారణం ఇదే 

TV9 Telugu

28 April 2024

అందాల భామ అనుపమకు కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉంది. యూత్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. 

కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా కనిపించి మెప్పించిన అనుపమ. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. 

రీసెంట్ గా డీజే టిల్లు సినిమాలో తన అందాలతో కవ్వించింది. మునుపెన్నడూ చూడని అందాలతో అదరగొట్టింది. 

అనుపమకు బోల్డ్ లుక్ లో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అంతలా మారిపోయిందేంటి అంటూ అవాక్ అవుతున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు అనుపమ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరదా అనే టైటిల్ తో ఈ మూవీ వస్తుంది . 

ఇటీవలే ఈ సినిమా టైటిల్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపించనుంది అనుపమ. 

ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, తెగ షేర్ చేస్తున్నారు. సెలబ్రెటీలు కూడా అనుపమకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. 

ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత కూడా అనుపమకు విషెస్ తెలిపింది. దానికి థాంక్యూ సమంతగారు అంటూ రిప్లే ఇచ్చింది అనుపమ.