AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టగలరా..?

తెలుగు, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. కథానాయికగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తెలుగు టాప్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇంతకీ గుర్తుపట్టారా ? ఆ అమ్మాయి ఎవరో. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అందమైన అమ్మాయి మరెవరో కాదు..

Tollywood: తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టగలరా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 28, 2024 | 4:53 PM

Share

తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ ఆ అమ్మాయి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని.. అప్పట్లో తనదైన నటనతో.. అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. కథానాయికగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తెలుగు టాప్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇంతకీ గుర్తుపట్టారా ? ఆ అమ్మాయి ఎవరో. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అందమైన అమ్మాయి మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ అమల అక్కినేని. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సతీమణి. కిరాయి దాదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అమల. ఇందులో నాగార్జున హీరోగా నటించారు. ఆ తర్వాత వెంకీతో రక్తతిలకం, అగ్గిరాముడు, చిరంజీవితో రాజా విక్రమార్క, రాజశేఖర్ తో ఆగ్రహం సినిమాల్లో నటించింది. అలాగే నాగార్జున సరసన చినబాబు, శివ, నిర్ణయం, ప్రేమ యుద్ధం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరు పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నాగార్జున 1992లో అమలను వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ అక్కినేని జన్మించాడు. అఖిల్ తెలుగులో ‘అఖిల్: ది పవర్ ఆఫ్ జో’ సినిమాతో అరంగేట్రం చేశాడు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమల.. బ్లూ్ క్రాస్ అనే పేరుతో జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించింది.

అమల తండ్రి ముఖర్జీ నేవీ ఆఫీసర్. కలకత్తాకు చెందిన వ్యక్తి. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళా. అమల తల్లిదండ్రులది ప్రేమ వివాహం. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు అమల. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఒకే ఒక జీవితం సినిమాల్లో తల్లి పాత్రలలో కనిపించారు అమల.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌