AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బాక్సాఫీస్ షేక్ చేసిన ఏకైక హీరో.. 2026లోనే వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్.. ఒక్కో సినిమా 100 కోట్లకు పైనే..

ఎలాంటి అంచనాలు లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ఏకైక హీరో గురించి విన్నారా.. ? అవును.. 2026 ఈ ఒక్క సంవత్సరంలోనే ఊహించని విధంగా వంద కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాడు అతడు. ఇటీవలే ఫాంటసీ యాక్షన్ డ్రామాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood : బాక్సాఫీస్ షేక్ చేసిన ఏకైక హీరో.. 2026లోనే వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్.. ఒక్కో సినిమా 100 కోట్లకు పైనే..
Suriya
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2026 | 9:41 AM

Share

2026 ఏడాదిలోనే వరుసగా మూడు సినిమాలతో సంచలనం సృష్టించిన హీరో గురించి తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ సంవత్సరం కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్, సీన్ ఇలా వరుసగా మూడు సినిమాలతో వరుసగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇటీవల మలయాళీ దర్శకుడు జీతూ మాధవన్ తమిళంలో మొదటిసారిగా దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ సినిమా సీన్. ఈ మూవీ విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 117 కోట్లు వసూలు చేసింది. దీంతో ఒకే సంవత్సరంలో వరుసగా మూడు చిత్రాలతో రూ. 100 కోట్ల మార్కును దాటిన కొత్త రికార్డును సూర్య సృష్టించారు. అంతకుముందు వచ్చిన ‘కరుప్పు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్లు, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ. 209 కోట్లు వసూలు చేశాయి. ఇటీవలి సంవత్సరాలలో ఒకే ఏడాదిలో తొలి వారాంతంలోనే మూడు చిత్రాలతో రూ. 100 కోట్ల మార్కును దాటిన ఘనతను ఏ హీరో సాధించలేదు. అయితే, ఈ వసూళ్ల విజయం కంటే కూడా సూర్య ఈ స్థాయికి చేరుకున్న విధానం మరింత గమనార్హం.

సూర్య ‘సూరరై పొట్రు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. అలాగే జై భీమ్’లో తన నటనకు కూడా ప్రశంసలు అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు కోవిడ్-19 మహమ్మారి సమయంలో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాయి. ఆ తర్వాత సూర్య తన ప్రాజెక్ట్స్ కంటెంట్ ఎంపిక తీరు మార్చుకున్నారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా కొత్త కంటెంట్ చిత్రాలు ఎంచుకున్నారు. ఒక నటుడిగా తనకు కొత్త అనుభవాలు ఇచ్చే, సంప్రదాయేతర కథలు చెప్పే, తాను మునుపెన్నడూ చేయని పాత్రలు ఇచ్చే దర్శకులను ఎంచుకోవాలనుకున్నాడు.

కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు రాగా తర్వాత ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ ఇందులో సూర్య నటనకు ప్రశంసలు అందుకున్నారు. కంగువ తర్వాత రెట్రో చిత్రంతో థియేటర్లలోకి వచ్చినప్పటికీ ఆ సినిమా సైతం నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది మాత్రం వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకున్నారు సూర్య. 2026లో విడుదలైన సూర్య మూడు చిత్రాల ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 650 కోట్లకు చేరువవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

సూర్య..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో