AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో

Raju M P R
| Edited By: |

Updated on: Nov 13, 2026 | 12:24 PM

Share

తిరుమల కొండ పైనే నడక మార్గాల్లో పాముల అలజడి భక్తులను భయపడుతోందివిష సర్పాల అలికిడి పరుగులు పెట్టిస్తోంది. జీవవైవిద్యం ఉట్టిపడేశేషాచలం కొండలు జీవరాశులకు నిలయం కాగా ఎన్నో సర్పజాతులు సేద తీరుతున్నాయి.దట్టమైన అటవీ ప్రాంతం కావడం తో సురక్షితమైన ఆవాసంగా మార్చుకున్న సర్పాలు బయటకు వచ్చి భయపెడుతున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల వెంకన్న కొలువైన సప్తగిరుల్లోని సర్పాలు బయట కనిపిస్తుండటంతో భక్తుల్లో భయం పెట్టాడుతోంది.

శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఇలా బయటకు వస్తున్న జర్రిపోతులు నాగుపాములు, కొండచిలువలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ అలజడి చేస్తున్నాయి.ఆదిశేషుడిని వాహనంగా చేసుకుని బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చే మలయప్ప స్వామి కొలువైన చోట పాములు సందడి చేస్తుండటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.తిరుమలలో నడక మార్గాల్లోనే కాకుండా తిరుమలలోని అతిథి గృహాలు, రింగురోడ్లు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో కంట పడుతున్న పాములు ఈ మధ్య కాలంలో నడక మార్గంలోనూ భక్తుల వెంట నడుస్తున్నాయి.చల్లని ప్రాంతాల్లో సేద తీరే ప్రయత్నం చేస్తున్న పాములు ఇలా బయటకు వస్తుండగా భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇందులో భాగం గానే నడక మార్గంలో భారీ కొండచిలువ భక్తుల కంటపడింది. అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి టెంపుల్ వద్ద సుమారు 12 అడుగుల కొండచిలువ కనిపించింది.
కొండచిలువ నడక మార్గంలో వెళ్లే భక్తులు, సిబ్బంది కంటపడడంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది టీటీడీ ఫారెస్ట్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న భాస్కర నాయుడుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు కొండచిలువను చాకచక్యంగా బంధించాడు.దీంతో భక్తులు ఊపిరి పీల్చుకోగా కొండచిలువను భాస్కర్ నాయుడు దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

Follow Us