వరుస సినిమాలతో అలరిస్తున్న అందాల శివాత్మిక రాజశేఖర్
13 November 2026
Rajeev Rayala
సీనియర్ హీరో రాజశేఖర్, జీవితల చిన్న కుమార్తెగా శివాత్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2019లో ఆనంద్ దేవరకొండ సరసన 'దొరసాని' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
దేవకి పాత్రలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో సైమా బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును అందుకుంది.
ఆనందం విలయాడుం వీడు సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఈ సినిమాలో మీనాక్షి పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పంచతంత్రంతో మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదు కథల సమాహారంగా తెరకెక్కిన 'పంచతంత్రం' సినిమాలో లేఖ పాత్రలో కనిపించింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బంగారం పాత్రలో నటించి తనలోని నటిని మరోసారి పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ .
2024లో వచ్చిన ఈ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. 'బాంబ్', 'ఆరోమలే' వంటి సినిమాలతో తమిళంలోనూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.
ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ ఈనగరానికి ఏమైంది సీక్వెల్ లో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.