ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. కృతిశెట్టి..
Rajitha Chanti
Pic credit - Instagram
14 November 2026
టాలీవుడ్‌లో 'ఉప్పెన' చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించి, కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన అందాల భామ కృతిశెట్టి. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోయింది. అప్పట్లో ఈ కన్నడ కస్తూరి క్రేజ్ టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. తర్వాత ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి.
అయినప్పటికీ ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ.
గతంలో ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో కృతిశెట్టిని టాలీవుడ్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరని ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేసింది.
టాలీవుడ్‌లో రామ్ చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన నటనంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని కృతి శెట్టి చెప్పిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆయన చేసే డాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆమె పేర్కొన్నారు. మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
ప్రస్తుతం కృతిశెట్టి టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోలతో కలిసి పనిచేస్తూ ఇప్పుడు తెలుగులోనూ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది
భవిష్యత్తులో ఆమెకు రామ్ చరణ్ సరసన నటించే అవకాశం ఏమైనా వస్తుందేమోనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ట్రెండింగ్‌లో నిలిచింది.