సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా తన ప్రేయసి హైన్ కిమ్ ను ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫోటోలు సందడి చేస్తున్నాయి. గతేడాది జులై 13న నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.