AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh : సినిమా ఛాన్స్ అంటే పర్సులో దాచిన పాస్ ఫోటో ఇచ్చిన హీరోయిన్.. దెబ్బకు షాకైన డైరెక్టర్ పూరి..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం స్లమ్ డాగ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా.. టబు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే పూరి జగన్నాథ్ సినిమా అంటే పాస్ ఫోటో ఇచ్చిన హీరోయిన్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.

Puri Jagannadh : సినిమా ఛాన్స్ అంటే పర్సులో దాచిన పాస్ ఫోటో ఇచ్చిన హీరోయిన్.. దెబ్బకు షాకైన డైరెక్టర్ పూరి..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2026 | 10:04 AM

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిచుకున్నారు. స్టార్ హీరోల కెరీర్ లో ఎన్నో హిట్స్ అందించిన పూరి.. అలాగే చాలా మంది కథానాయికలను వెండితెరకు పరిచయం చేశారు. అయితే ఆయన సినీ ప్రయాణంలో ఓ హీరోయిన్ ద్వారా జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా ఛాన్స్ కోసం ఫోటోస్ అడగ్గా.. ఆధార్ కోసం దాచిన పాస్ ఫోటో ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు. తనే అనుష్క శెట్టి. అనుష్కను మొదటిసారి తాను బాంబేలో ఆడిషన్ చేసిన సందర్భాన్ని పూరి గుర్తుచేసుకున్నారు. ఒక చిన్న గదిలో, చాలా భయపడుతూ, సిగ్గుపడుతూ ఆడిషన్ ఇచ్చిన కన్నడ అమ్మాయి ఆమె అని వివరించారు. అప్పట్లో నాగార్జున గారు తనతో మాట్లాడుతూ, “పూరి గారు మనకు హీరోయిన్ కావాలి, ఒకసారి చూడండి” అని చెప్పి, కొన్ని ఫోటోలు పంపించారని తెలిపారు. ఆ ఫోటోలలో, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న ఒక ఫోటో చూసి, “ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుంది” అని తాను భావించి ఆమెను సూపర్ చిత్రం కోసం ఎంపిక చేశానని వెల్లడించారు.

అయితే సూపర్ సినిమా కోసం ఫోటోస్ అడగ్గా.. తన దగ్గర పర్సులో ఆధార్ కోసం దాచుకున్న చిన్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తనకు చూపించిందని గుర్తు చేసుకున్నారు. యాక్టింగ్ వచ్చా అంటే తెలీదు అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. అలాంటి అమాయకమైన అమ్మాయిని తాను సూపర్ సినిమాతో పరిచయం చేశానని… కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఆమె దాదాపు 30-40 మంది ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశారని, వారిలో రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు ఉన్నారని పేర్కొన్నారు. తాను అనుష్కలో మొట్టమొదట చూసిన లక్షణం, ఎంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ఆమెలో అదే సిగ్గు, అదే భయం, అదే విధమైన డౌన్ టు ఎర్త్ స్వభావం ఏ మాత్రం మారలేదని పూరి అన్నారు.

అనుష్క లాంటి మంచి అమ్మాయిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినందుకు నాగార్జున గారికి పూరి జగన్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అనుష్క అటు సినిమాలకు, ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

అనుష్క శెట్టి..

Anushka Shetty

Anushka Shetty

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో