AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి కిటికీ గ్రిల్‌కు చుట్టుకుని భారీ ఫైథాన్ తిష్ట! భయంతో పరుగులు తీసిన కుటుంబం!

విశాఖ నగరంలోని మురళీనగర్‌లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ ఇంటి కిటికీ గ్రిల్‌కు సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ చుట్టుకుని కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఊహించని విధంగా ఇంటి కిటికీ వద్ద పాము కనిపించడంతో భయంతో బయటకు పరుగులు తీశారు.

Balaraju Goud
|

Updated on: Nov 13, 2026 | 1:20 PM

Share

విశాఖపట్నం: నగరంలోని మురళీనగర్‌లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ ఇంటి కిటికీ గ్రిల్‌కు సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ చుట్టుకుని కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఊహించని విధంగా ఇంటి కిటికీ వద్ద పాము కనిపించడంతో భయంతో బయటకు పరుగులు తీశారు.

వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన ఎంతో జాగ్రత్తగా కొండచిలువను పట్టుకుని సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జనావాసాల్లోకి భారీ కొండచిలువలు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు కనిపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా నిపుణులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us