అందాల భామ వామిక గబ్బి 2015లోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు హీరోగా నటించిన 'భలే మంచి రోజు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఈ సినిమాలో సీత పాత్రలో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ సినిమాలో వామికకు మంచి గుర్తింపు లభించింది.
తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమా తర్వాత తెలుగులో పలు అవకాశాలు వచ్చినప్పటికీ, తనకు నచ్చిన కథలకే ప్రాధాన్యత ఇచ్చింది.
మంచి పారితోషికం వచ్చినా, కథ నచ్చకపోతే సినిమాలు అంగీకరించనని గతంలో వెల్లడించింది. తెలుగు సినిమాతో పాటు తమిళం, మలయాళం, పంజాబీ, హిందీలోనూ నటించింది
గూడచారి 2తో మరోసారి టాలీవుడ్‌లోకి మరోసారి ఎంట్రీ ఇస్తుంది. అడివి శేష్ నటిస్తున్న 'గూడచారి 2' (G2) సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వరుసగా ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న వామిక గబ్బి, తెలుగులోనూ మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి.
రీసెంట్ గా తమిలో డీసీ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది వామిక