AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి వివాదాల్లో చిక్కుకున్న బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌.. ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మరోసారి వివాదాల్లో చిక్కుకున్న బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌.. ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు!
Bjp Mp Actress Kangana Ranaut
Balaraju Goud
|

Updated on: Nov 14, 2026 | 11:58 AM

Share

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అసలు వివాదం ఏమిటంటే?

సిమ్లాకు చెందిన రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవంబర్ 13న ఈ కేసు నమోదైంది. నవంబర్ 10న కంగనా తన ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీ కుటుంబ మరణాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ పరోక్ష ఆరోపణలు చేశారని ఫిర్యాదులో తెలిపారు.

మూడు సెక్షన్ల కింద కేసు నమోదు!

భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 196(1)(b), 353(2), 356(2) సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సిమ్లా ఎస్పీ గౌరవ్ సింగ్ కేసు నమోదును ధృవీకరిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. సుమారు 1981 నాటి గాంధీ కుటుంబానికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఈ పోస్టు చేసినట్లు సమాచారం. సోనియా గాంధీ ఆత్మకథ విడుదలైన రోజునే ఈ వ్యాఖ్యలు వెలువడటం మరింత చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కంగనా రనౌత్‌పై నమోదైన ఈ కేసు రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో