కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలో తెలుసా?

samatha

14 November 2026

Pic credit - Pinterest

కార్తీక మాసం ప్రారంభం అయ్యింది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం శివుడిని ఆరాధిస్తూ ఉంటారు.

కార్తీక మాసం

అంతే కాకుండా శివాలయాలను సందర్శిస్తూ, నియమ నిబంధనలు పాటిస్తారు. ప్రతి రోజూ దీపం వెలిగిస్తుంటారు.

ఆలయాలను సందర్శించడం

అలాగే ఈ మాసంలో తప్పకుండా నదీ స్నానం చేసి వస్తారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కార్తీక మాసంలో నది స్నానం ఎందుకు చేయాలో..

నది స్నానం

కాగా, ఇప్పుడు మనం అసలు కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి అనేదాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎందుకు చేయాలి?

పవిత్రమైన కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీని వెనక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంట.

పురాణాలు

కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించక ముందు నదీ స్నానం చేయడం వలన జన్మ జన్మల పాపాలు అన్నీ కూడా తొలిగిపోతాయంట.

పాపాలు తొలిగిపోవడం

ముఖ్యంగా కార్తీక మాసంలో  చంద్రుడు శక్తివంతంగా ఉంటాడు. ఆయన కిరణాలు పడిన నీటిని స్నానం చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందంట.

మానసిక ప్రశాంతత

ఆరోగ్య పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి. చలికాలంలో నది నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందువలన ఆ నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు రావంట.

ఆరోగ్య పరమైన లాభాలు