ఆచార్య చాణక్యుడు అపర మేధావి. తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
నీతి శాస్త్రం అనే పుస్తకం
అలాగే ప్రస్తుత కలియుగంలో, మంచితనం బలహీనతగా, సహాయం మోసానికి దారి తీసే సందర్భాలు సర్వసాధారణం. నమ్మకం దెబ్బతిని, స్వార్థం, దగా పెచ్చు మీరుతున్న ఈ సమాజంలో ఎలా జీవించాలనే ఆందోళన ప్రతి ఒక్కరి లోనూ నెలకొంది.
కలియుగం
దాని గురించి చాణక్యుడు తెలిపాడు. కలియుగంలో ప్రశాంతంగా బతకడానికి చాణక్యుడు చెప్పిన ఐదు అత్యంత ముఖ్యమైన సూత్రాలు ఏవో చూసేద్దాం.
ముఖ్యమైన సూత్రాలు
కలియుగంలో మనుషుల మనస్తత్వాలు క్షణ క్షణానికి మారిపోతాయి. ఈరోజు ఆప్తులుగా ఉన్నవారు రేపు శత్రువులుగా మారవచ్చు. "నీ రహస్యం నీ మనసులో ఉన్నంతవరకే నువ్వు దానికి యజమాని. అది బయటకు వస్తే నువ్వు బానిస.
శత్రువులు
ఈ యుగంలో బంధాలకు, అనుబంధాలకు విలువ లేదు. డబ్బుకే అత్యధిక ప్రాధాన్యత ఉంది. "ధనం ఉన్నవాడినే ఈ లోకం గౌరవిస్తుంది" అని చాణక్యుడు స్పష్టంగా చెప్పారు.
బంధాలకు నో విలువ
చాణక్యుడు అడవిలో చెట్లను నరికేవాడు ముందుగా తిన్నగా ఉన్న చెట్లనే నరుకుతాడు, వంకరగా ఉన్నవాటిని వదిలేస్తాడు. సమాజంలోనూ అంతే, మీరు మరీ మంచిగా ఉండి, కాదు అని చెప్పలేకపోతే, ఈ లోకం మిమ్మల్నే ముందుగా వాడుకుంటుంది
మంచితనమే ముచేస్తది
ఇంట్లో శాంతి ఉండాలంటే బయటివారి ప్రభావం ఇంట్లో పడకూడదు. ఈ రోజుల్లో ఎవరింట్లో ఏం జరుగుతుందనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. ఇది మీకు సమస్యలను తీసుకొస్తుంది.
ఇంట్లో శాంతి ఉండాలంటే?
కలియుగంలో మనిషి ఎదుర్కొనే అతి పెద్ద సమస్య అంచనాలు నా పిల్లలు నన్ను చూసుకుంటారు, నా స్నేహితుడు నాకు సహాయం చేస్తాడు, నా బంధువులు నాకు అండగా ఉంటారు"అని ఇతరులపై ఆధారపడి బతకడం మానేయండి.