AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh Ravichander: మంచం లేని బెడ్‌రూమ్.. నేలపైనే నిద్ర.. అనిరుధ్ సింపుల్ లైఫ్ స్టైల్.. ఇల్లు చూశారా.. ?

టాలీవుడ్, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే ఆయన హోమ్ టూర్ వీడియో సైతం ఆకట్టుకుంటుంది. ఇంట్లో హోమ్ థియేటర్, కుటుంబ ఫొటోలతో మెమరీ వాల్, చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం అనిరుధ్ హోమ్ టూర్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Anirudh Ravichander: మంచం లేని బెడ్‌రూమ్.. నేలపైనే నిద్ర.. అనిరుధ్ సింపుల్ లైఫ్ స్టైల్.. ఇల్లు చూశారా.. ?
Anirudh Home Tour
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2026 | 12:00 PM

Share

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన ట్యూన్స్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. తన మ్యూజిక్ ద్వారా శ్రోతలను ఊర్రూతలూగించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశారు. నవంబర్ 11న హైదరాబాద్ సన్ రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 21న వీరిద్దరి వివాహ రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా జరగనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అనిరుధ్ లైఫ్ స్టైల్, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ప్రముఖ డిజైన్ మ్యాగజైన్ కోసం ఆయన తన చెన్నై నివాసాన్ని ఇంటీరియర్ టూర్ ద్వారా పరిచయం చేశారు. ఈ సందర్భంగా అనిరుధ్ తన ఇంటికి సంబంధించిన విశేషాలను పంచుకోగా, అందులో ఆయన బెడ్‌రూమ్‌కు సంబంధించి చెప్పిన ఒక వింత విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లు అంటే ఖరీదైన ఫర్నిచర్, అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని భావిస్తుంటాం. కానీ అనిరుధ్ రవిచందర్ బెడ్‌రూమ్‌లో ఎలాంటి పెద్ద మంచం (Bed) లేకపోవడం విశేషం. దీనికి బదులుగా ఆయన తన గదిలో నేలపై నేరుగా మ్యాట్రెస్ వేసుకుని నిద్రపోవడాన్ని ఇష్టపడతానని తెలిపారు. నేలపై పడుకోవడం ఎందుకో ఎంతో సౌకర్యంగా ఉంటుందని, అలాగే అది ఆరోగ్యానికి మంచిదని.. తనకు ఎక్కువ బట్టలు లేదా సామాగ్రిని పోగేసుకోవడం ఇష్టం ఉండదని ఆయన సరదాగా పేర్కొన్నారు. ఇక చెన్నైలోని ఈ నివాసంలో అనిరుధ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఎంత బిజీ లైఫ్ గడిపినా, ఇంటికి రాగానే సాధారణ జీవితాన్ని గడపడానికే ఆయన ఇష్టపడతారు. ఈ ఇంట్లో కుటుంబ జ్ఞాపకాలను భద్రపరచడానికి ఒక ప్రత్యేకమైన ‘మెమరీ వాల్’ ఉండటం మరో విశేషం. తన చిన్ననాటి ఫోటోలు, కుటుంబ సభ్యులతో దిగిన అరుదైన చిత్రాలను ఈ గోడపై అమర్చుకున్నారు. అలాగే సినిమా పరిశ్రమకు రాకముందు నుంచి ఇప్పటివరకు తన ప్రయాణంలో ఎదురైన మధుర జ్ఞాపకాలను ఈ ఇల్లు ఎప్పుడూ గుర్తుచేస్తుందని ఆయన చెప్పారు.

ఈ నివాసంలో కేవలం కుటుంబంతో గడపడానికే కాకుండా, సినిమా కథలు వినడానికి, మ్యూజిక్ కంపోజ్ చేయడానికి అనువైన ప్రత్యేక స్టూడియో స్పేస్ కూడా ఉంది. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాలు చూసేందుకు వీలుగా అత్యాధునిక హోమ్ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంటి ఆవరణలో పెద్ద మామిడి చెట్టు ఉండటం, పచ్చని వాతావరణం ఈ ఇంటికి మరింత ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంతటి స్టార్‌డమ్ అనుభవిస్తున్నప్పటికీ, తన మూలాలను మరిచిపోకుండా సాధారణ జీవితాన్ని గడపడమే తన విజయ రహస్యమని అనిరుధ్ నిరూపిస్తున్నారు.

అనిరుధ్ హోమ్ టూర్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో