పాపం ఈ అమ్మడు.. 8 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. గ్లామర్ స్టన్నింగ్
Rajitha Chanti
Pic credit - Instagram
13 November 2026
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి కథానాయికగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది అందాల భామలు ప్రయత్నిస్తుంటారు.
అయితే అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ కొందరికి అదృష్టం కలిసిరాక ఆశించిన స్థాయిలో విజయాలు దక్కవు. అలాంటి కోవకు చెందిన హీరోయిన్ ఆమె.
మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ప్రణీత సుభాష్. తెలుగు ప్రేక్షకులకు 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో పరిచయమైంది ఈ కన్నడ కస్తూరి.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి కుర్రకారును కట్టిపడేసింది. తెలుగులో దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించిన ప్రణీతకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు.
పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం మాత్రమే ఆమెకు కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందించింది. ఈ మూవీతో పాపులర్ అయ్యింది.
మెయిన్ హీరోయిన్‌గానే కాకుండా సెకండ్ హీరోయిన్‌గానూ పలు చిత్రాల్లో నటించి మెప్పించినప్పటికీ, ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమైంది.
కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత, ఆ తర్వాత పూర్తిగా కుటుంబ బాధ్యతలకే పరిమితమైంది.
ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్