IRCTC Tour Package: రూ.1074కే జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్
ఈ వేసవి సెలవుల్లో ఏడు జ్యోతిర్లింగాలను సందర్శించాలనుకుంటే మీ కోసం ఐఆర్‌సీటీసీ ఒక గొప్ప టూర్ ప్యాకేజీని లాంచ్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో ఏడు జ్యోతిర్లింగ దర్శన యాత్రను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ యోగానగరి రిషికేష్ రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా నిర్వహిస్తోంది. ఈ యాత్రలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భెంట్ ద్వారక, ద్వారకాధీష్ ఆలయం, నాగేశ్వర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనాలు ఉంటాయి.
ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో చాలా మంది కుటుంబంతో పాటు టూర్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ వేసవి సెలవుల్లో ఏడు జ్యోతిర్లింగాలను సందర్శించాలనుకుంటే మీ కోసం ఐఆర్‌సీటీసీ ఒక గొప్ప టూర్ ప్యాకేజీని లాంచ్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో ఏడు జ్యోతిర్లింగ దర్శన యాత్రను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ యోగానగరి రిషికేష్ రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా నిర్వహిస్తోంది. ఈ యాత్రలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భెంట్ ద్వారక, ద్వారకాధీష్ ఆలయం, నాగేశ్వర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనాలు ఉంటాయి. ఈ ఈ టూర్ ప్యాకేజీ 22 మే 2024 నుంచి 2 జూన్ 2024 వరకు 11 రాత్రులు, 12 రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారత్ గౌరవ్ రైలులో ఈ ప్రయాణంలో పర్యాటకులకు ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భెంట్ ద్వారక, ద్వారకాధీష్ ఆలయం, నాగేశ్వర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్ మరియు భీమశంకర్ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు. తరగతుల వారీగా, ఈ రైలులోని మొత్తం బెర్త్‌ల సంఖ్య 767, ఇందులో 2 ఏసీలో మొత్తం 49 సీట్లు, 3 ఏసీలో మొత్తం 70 సీట్లు, స్లీపర్ కోచ్‌లో మొత్తం 648 సీట్లు సీట్లు ఉన్నాయి. ప్రయాణీకులు ఈ రైలును రిషికేశ్, హరిద్వార్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్‌పూర్, హర్దోయ్, లక్నో, కాన్పూర్, ఒరాయ్, వీరాంగన లక్ష్మీబాయి, లలిత్‌పూర్ నుంచి ఎక్కవచ్చు. ఈ ప్యాకేజీలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ తరగతి ప్రయాణం, అల్పాహారం, శాఖాహార భోజనం, రాత్రి భోజనం, ఏసీ/నాన్ ఏసీ బస్సుల ద్వారా స్థానిక సందర్శనా స్థలాలు ఉన్నాయి.
ఛార్జీలు ఇలా
- ఎకానమీ క్లాస్‌లో (స్లీపర్ క్లాస్) కలిసి ఉండే ప్యాకేజీ ధర రూ. 22150. అలాగే ఒక్కో చిన్నారికి (5-11 సంవత్సరాలు) ప్యాకేజీ ధర రూ. 20800. స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, డబుల్/ట్రిపుల్‌లో నాన్-ఏసీ హోటళ్లలో బస చేయడం, మల్టీ-షేర్, నాన్-ఏసీ ట్రాన్స్‌పోర్ట్‌లో నాన్-ఏసీ హోటల్ రూమ్‌లు వంటి సదుపాయాలు ఉంటాయి.
- స్టాండర్డ్ క్లాస్ (3ఏసీ క్లాస్)లో కలిసి ఉండే ఒకరికి/ఇద్దరు/ముగ్గురికి ప్యాకేజీ ధర రూ. 36700, ఒక్కో చిన్నారికి (5-11 సంవత్సరాలు) ప్యాకేజీ ధర రూ.35150గా ఉంది. 3 ఏసీ క్లాస్ రైలు ప్రయాణం, డబుల్/ట్రిపుల్‌లో ఏసీ హోటళ్లలో బస చేయడం, డబుల్/ట్రిపుల్, నాన్-ఏసీ ట్రాన్స్‌పోర్ట్‌లో నాన్-ఏసీ హోటల్ రూమ్‌లు ఉంటాయి.
- కంఫర్ట్ క్లాస్ (2ఏసీక్లాస్)లో ఒకరికి/ఇద్దరు/ముగ్గురు కలిసి ఉండే ప్యాకేజీ ధర రూ. 48600, ఒక్కో చిన్నారికి (5-11 సంవత్సరాలు) ప్యాకేజీ ధర రూ.46700గా ఉంది. 2 ఏసీ క్లాస్ రైలు ప్రయాణం, డబుల్/ట్రిపుల్‌లో ఏసీ హోటళ్లలో బస చేయడం, డబుల్/ట్రిపుల్, ఏసీ హోటల్ గదుల్లో బస వంటి సదుపాయాలు ఉంటాయి.
రూ.1074 ప్రయాణం ఇలా
ఈ టూర్ ప్యాకేజీలో ఎల్‌టీసీ, ఈఎంఐ సౌకర్యం (ఈఎంఐ నెలకు రూ. 1074 నుంచి ప్రారంభమవుతుంది) కూడా అందుబాటులో ఉంది. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. దీనిని ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకుల నుంచి పొందవచ్చు. ఈ ప్యాకేజ గురించి ఐఆర్‌సీటీసీ రీజియన్ చీఫ్ రీజినల్ మేనేజర్, అజిత్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్ ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..