Doorstep Banking: ఇక క్యాష్ కూడా డోర్ డెలివరీ.. ఏటీఎం వరకూ వెళ్లాల్సిన పనిలేదు.. పోస్టాఫీస్ నుంచి కొత్త సర్వీస్..

ఎందుకంటే కొన్ని చోట్ల ఈ డిజిటల్ లావాదేవీలు అందుబాటులో లేకపోయినా.. లేకపోతే అకస్మాత్తుగా సర్వర్ డౌన్ అయినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొంత మొత్తం బ్యాంకు లేదా ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసి ఇంట్లో ఉంచుతున్నారు. అయితే బ్యాంక్, ఏటీఎం వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి ఏంటి? వారి ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన ఉంటుంది. ఈ క్రమంలో ఆ అవసరం లేకుండా డోర్ స్టెప్ బ్యాంకింగ్ ను ఇండియా పోస్ట్ తీసుకొచ్చింది.

Doorstep Banking: ఇక క్యాష్ కూడా డోర్ డెలివరీ.. ఏటీఎం వరకూ వెళ్లాల్సిన పనిలేదు.. పోస్టాఫీస్ నుంచి కొత్త సర్వీస్..
Post Office
Follow us

|

Updated on: Apr 28, 2024 | 3:42 PM

బ్యాంకింగ్ రంగం డిజిటల్ బాటలో వేగంగా ప్రయాణిస్తోంది. ఎక్కడ చూసినా క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. అందరూ క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలు జరుపుతున్నారు. అయినప్పటికీ కొంత నగదు చేతిలో ఉంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ డిజిటల్ లావాదేవీలు అందుబాటులో లేకపోయినా.. లేకపోతే అకస్మాత్తుగా సర్వర్ డౌన్ అయినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొంత మొత్తం బ్యాంకు లేదా ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసి ఇంట్లో ఉంచుతున్నారు. అయితే బ్యాంక్, ఏటీఎం వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి ఏంటి? వారి ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన ఉంటుంది. ఈ క్రమంలో ఆ అవసరం లేకుండా డోర్ స్టెప్ బ్యాంకింగ్ ను ఇండియా పోస్ట్ తీసుకొచ్చింది. పోస్టాఫీసు సాయంతో ఇంటి వద్ద నగదు విత్ డ్రా చేసుకొనే వెసులుబాటు కలుగుతోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ద్వారా ఇంటి వద్దే నగదు విత్ డ్రా చేసుకొనే అవకాశం ఉంటోంది. ఆధార్ ఆధారిత పేమెంట్(ఏఈపీఎస్) సేవ ద్వారా దీనిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్ ఏనేబుల్ పేమెంట్ సర్వీస్(ఏఈపీఎస్) ద్వారా పోస్టాఫీసు అందించే ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల గురించి తెలుసుకుందాం..

ఏఈపీఎస్ అంటే..

ఆధార్ ఏనేబుల్డ్ పేమెంట్ సర్వీస్(ఏఈపీఎస్) అంటే ఆధార్ బయోమెట్రిక్ ద్వారా నిర్వహించే సర్వీస్. దీని సాయంతో బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేయొచ్చు. బ్యాలెన్స్ వివరాలు, నగదు విత్ డ్రా, రెమిటెన్స్ లావాదేవీలు దీని సాయంతో నిర్వహించవచ్చు. చిన్న మొత్తాలను బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా విత్ డ్రా చేయొచ్చు. అత్యవసర పరిస్థితులో.. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయి.

ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలంటే..

ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు అన్ని బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉండదు. మీ ఖాతా ఉన్న బ్యాంకు కు ఏఈపీఎస్ సేవలందించే జాబితాలో ఉండాలి. అయితే దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకుల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తుల బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. ఆ ఆధార్ మీ ఫోన్ నంబర్ కు లింక్ అయ్యి ఉండాలి. అప్పుడే ఈ తరహా లావాదేవీ సాధ్యమవుతుంది. డోర్ స్టెప్ లావాదేవి ఎంచుకున్నప్పుడు బయోమెట్రిక్ సాయంతో మీ నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. డోర్ స్టెప్ సేవలను వినియోగించుకోవాలంటే కొంత రుసుము అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 10వేలు మాత్రమే విత్ డ్రా చేసేందుకు అనుమతి ఉంటుంది. మీరు ఈ సేవను వినియోగించుకోవాలంటే సర్వీస్ రిక్వెస్ట్ ఫారమ్ లో వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. దానిలో మీ పేరు, చిరునామా, మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసు వివరాలు పొందుపరచాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
జీతం సరిపోవడం లేదా.? ఇంట్లో చేసే ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం
జీతం సరిపోవడం లేదా.? ఇంట్లో చేసే ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం
స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేసిన క్యాన్సర్ తో బాధపడుతున్న వృద్ధురాలు
స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేసిన క్యాన్సర్ తో బాధపడుతున్న వృద్ధురాలు
మండుటెండలోనూ బారులు తీరిన ఓటర్లు.. పోలింగ్ శాతం పెరిగే అవకాశం..
మండుటెండలోనూ బారులు తీరిన ఓటర్లు.. పోలింగ్ శాతం పెరిగే అవకాశం..
ఐటీఆర్‌ ఫైల్‌ చేసేందుకు 3 ఫారమ్స్‌ విడుదల.. ఏయే వ్యక్తులకు అంటే..
ఐటీఆర్‌ ఫైల్‌ చేసేందుకు 3 ఫారమ్స్‌ విడుదల.. ఏయే వ్యక్తులకు అంటే..
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. రాగి రొట్టెలు తినాల్సిందే!
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. రాగి రొట్టెలు తినాల్సిందే!
ఓ రైలు.. 5వేల మంది ఓటర్లు.. నాందేడ్ టు విశాఖ.. క్షణ క్షణం ఉత్కంఠ
ఓ రైలు.. 5వేల మంది ఓటర్లు.. నాందేడ్ టు విశాఖ.. క్షణ క్షణం ఉత్కంఠ
కొడిగుడ్డు పెంకులను పడేస్తున్నారా.? ఇలా చేయండి చర్మం మెరుస్తుంది
కొడిగుడ్డు పెంకులను పడేస్తున్నారా.? ఇలా చేయండి చర్మం మెరుస్తుంది
అబ్బబ్బ.! ఎంత చల్లటి వార్త.. ఈ ప్రాంతాలకు ఉరుములతో భారీ వర్షాలు..
అబ్బబ్బ.! ఎంత చల్లటి వార్త.. ఈ ప్రాంతాలకు ఉరుములతో భారీ వర్షాలు..
సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
రితికాసింగ్ తండ్రిని చూస్తే అవాక్ అవ్వాల్సిందే..
రితికాసింగ్ తండ్రిని చూస్తే అవాక్ అవ్వాల్సిందే..
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.