AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌కు NGT అనుమతి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు (రూ.80,000 కోట్ల విలువైన) పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఫిబ్రవరి 16, 2026న కొట్టివేసింది. ఆరుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం 80 వేల కోట్ల విలువైన..

గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌కు NGT అనుమతి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Minister Kishan Reddy
Subhash Goud
|

Updated on: Feb 17, 2026 | 5:52 PM

Share

Kishan Reddy: గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌కు NGT అనుమతి లభించిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కీలక ట్వీట్‌ చేశారు. సోనియా, రాహుల్‌ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు (రూ.80,000 కోట్ల విలువైన) పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఫిబ్రవరి 16, 2026న కొట్టివేసింది. ఆరుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం 80 వేల కోట్ల విలువైన గ్రేట్‌ నికోబార్‌ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాముఖ్యత, తగినంత పర్యావరణ రక్షణ చర్యలు ఉన్నాయని పేర్కొంటూ, NGT క్లియరెన్స్‌ను సమర్థించింది. ఈ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్, ఎయిర్‌పోర్ట్, టౌన్‌షిప్ ఉన్నాయి. జోక్యం చేసుకోవడానికి ఎటువంటి ఆధారం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలు కోట్ల విలువైన గ్రేట్ నికోబార్ మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం భారత్ ట్రాన్స్‌షిప్‌మెంట్ కోసం విదేశీ నౌకాశ్రయాలపై అధికంగా ఆధారపడుతోందని, గ్రేట్ నికోబార్ మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో భాగంగా అంతర్జాతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ కేంద్రం, ఒక పట్టణం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని వినియోగించుకుని తూర్పు–పడమర నౌకాశ్రయ మార్గాల్లో సరుకు రవాణాకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉందన్నారు.

ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ప్రచారం నిర్వహించాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ సెప్టెంబర్ 5న ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో అబద్దపు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు National Green Tribunal (NGT) గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చింది. 2022లో ఇచ్చిన పర్యావరణ అనుమతిపై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని NGT స్పష్టం చేసింది.

దీంతో సోనియా గాంధీ–రాహుల్ గాంధీ ప్రయత్నం మరోసారి విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆత్మనిర్భర్, వికసిత భారత్ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేస్తుండగా, కొందరు భారత అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే భారత ఎదుగుదలను వ్యతిరేకించే వారి ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us