AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Middle Class Trap: జీతం పెరిగినా దారిద్య్రం వదలడం లేదా?.. మిమ్మల్ని ముంచేస్తున్న ఆ 5 సైలెంట్ కిల్లర్స్ ఇవే!

జీతం పెరుగుతోంది.. హోదా పెరుగుతోంది.. కానీ చేతిలో మాత్రం చిల్లిగవ్వ మిగలడం లేదు! ఒకవైపు కోటీశ్వరులు మరింత సంపదను కూడబెట్టుకుంటుంటే, మరోవైపు మధ్యతరగతి జీవి నెలాఖరు వచ్చేసరికి ఖాతాలు సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నాడు. బయటకు కనిపించేది విలాసవంతమైన జీవితం… లోపల మాత్రం ఆర్థిక ఆందోళన. ఈ కంటికి కనిపించని ‘ఆర్థిక ఉచ్చు’ వెనుక ఉన్న చేదు నిజాలను ఒకసారి లోతుగా పరిశీలిస్తే అసలు సమస్య ఎక్కడుందో అర్థమవుతుంది.

Middle Class Trap: జీతం పెరిగినా దారిద్య్రం వదలడం లేదా?.. మిమ్మల్ని ముంచేస్తున్న ఆ 5 సైలెంట్ కిల్లర్స్ ఇవే!
Middle Class Trap
Bhavani
|

Updated on: Feb 17, 2026 | 7:15 PM

Share

భారతదేశంలో మధ్యతరగతి అనేది ఒక విచిత్రమైన హోదా. ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నా, ఏదో ఒక శక్తి వారిని మళ్ళీ వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, నెలాఖరు వచ్చేసరికి అప్పుల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తోంది? నిపుణుల విశ్లేషణ ప్రకారం, మధ్యతరగతి వారిని పేదరికంలోనే ఉంచే ఆ ‘ఆర్థిక ఉచ్చులు’ ఇవే..

1. సంపదను తినేసే సైలెంట్ కిల్లర్

ప్రతి ఏటా జీతం 5-10 శాతం పెరుగుతుంటే, మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు అంతకంటే వేగంగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చులు సామాన్యుడి అంచనాలకు అందడం లేదు. అంటే, మీ ఆదాయం పెరుగుతున్నా, మీ కొనుగోలు శక్తి మాత్రం క్రమంగా తగ్గుతోంది. ఈ ‘ఇన్ఫ్లేషన్’ కారణంగానే మీరు ఎంత సంపాదించినా అది సరిపోవడం లేదు.

2. తక్షణ సుఖం.. దీర్ఘకాలిక భారం

నేడు మార్కెట్ అంతా “బై నౌ.. పే లేటర్” (ఇప్పుడే కొనండి.. తర్వాత కట్టండి) అనే సూత్రంపై నడుస్తోంది. చిన్న చిన్న వాయిదాల మోజులో పడి భవిష్యత్తు ఆదాయాన్ని ముందే ఖర్చు చేసేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎంఐల వల్ల అసలు ఆదాయంలో పొదుపు చేయడానికి మార్గమే లేకుండా పోతోంది.

3. హోదా కోసం ఆరాటం

 పక్కవాడి కారు కంటే పెద్ద కారు ఉండాలి, సమాజంలో గొప్పగా కనిపించాలి అనే తాపత్రయం మధ్యతరగతి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఆదాయం పెరగగానే అవసరాలను పెంచుకోవడాన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు. సంపదను సృష్టించాల్సిన వయసులో, కేవలం వస్తువుల ప్రదర్శన కోసం ఖర్చు చేయడం వల్ల ఆర్థిక పురోగతి ఆగిపోతోంది.

4. అత్యవసర నిధి లేకపోవడం

చాలా కుటుంబాల్లో ఒక నెలకు సరిపడా ఆదాయం రాకపోయినా లేదా ఉద్యోగం పోయినా తట్టుకునే శక్తి లేదు. ప్రతి రూపాయిని ఏదో ఒక ఖర్చుకు కేటాయించడం వల్ల, ఊహించని అనారోగ్యం లేదా ఆకస్మిక అవసరాలు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుల ఊబిలోకి కూరుకుపోవాల్సి వస్తోంది.

5. అప్పుల కోసం శ్రమించే వ్యవస్థ

ధనవంతులు తమ డబ్బుతో డబ్బును సంపాదిస్తుంటే (Assets), మధ్యతరగతి వారు మాత్రం కేవలం అప్పుల వడ్డీలు కట్టడానికి, పన్నులు చెల్లించడానికే తమ శ్రమను ధారపోస్తున్నారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల, డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక కేవలం వినియోగదారులుగా (Consumers) మాత్రమే మిగిలిపోతున్నారు.

మధ్యతరగతి ట్రాప్ నుండి బయటపడాలంటే ఆదాయాన్ని పెంచుకోవడం మాత్రమే పరిష్కారం కాదు.. ఖర్చులను నియంత్రించుకోవడం  తెలివైన పెట్టుబడులు పెట్టడం కీలకం. ఆడంబరాల కంటే ఆర్థిక భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్