AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు పొందే అవకాశం

మార్కెట్‌లో కూడా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ పెరగడంతో సేంద్రియ వ్యసాయం చేసే వారిక సంఖ్య పెరుగుతుంది. ఇలానే జైపూర్‌లోని ఫులేరాలోని కలఖ్ గ్రామానికి చెందిన గంగా రామ్ సేపత్ అనే రైతు సేంద్రీయ వ్యవసాయం ద్వారా వార్షికంగా రూ.40 లక్షలను సంపాదిస్తున్నాడు. అతని వ్యవసాయానికి అతని ఇద్దరు సోదరులు కూడా సహాయం చేస్తున్నారు.

Success Story: సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు పొందే అవకాశం
Gangaram Sepat
Nikhil
|

Updated on: Apr 28, 2024 | 4:45 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో పెరిగిన ఎరువుల వినియోగాన్ని నియంత్రించేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. మార్కెట్‌లో కూడా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ పెరగడంతో సేంద్రియ వ్యసాయం చేసే వారిక సంఖ్య పెరుగుతుంది. ఇలానే జైపూర్‌లోని ఫులేరాలోని కలఖ్ గ్రామానికి చెందిన గంగా రామ్ సేపత్ అనే రైతు సేంద్రీయ వ్యవసాయం ద్వారా వార్షికంగా రూ.40 లక్షలను సంపాదిస్తున్నాడు. అతని వ్యవసాయానికి అతని ఇద్దరు సోదరులు కూడా సహాయం చేస్తున్నారు. ఇటీవల గంగారామ్ సేవత్ కృషి జాగరణ్ ద్వారా దోసకాయ సాగు కోసం జాతీయ స్థాయిలో మిలియనీర్ హార్టికల్చర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా బిరుదు కూడా పొందారు. అతని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి మరింత తెలుసుకుందాం.

గంగారమ్ సేపత్ 2012లో సెపత్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించాడు, ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేస్తుంది. 2018 వరకు అతను అధికారికంగా తన వెంచర్‌ను నమోదు చేయలేదు. ముఖ్యంగా  సంప్రదాయ పంటల రక్షణ పద్ధతుల్లో రసాయనాలను ఎక్కువగా వాడడమే అనేక ఆరోగ్య సమస్యలకు కారణమని గుర్తించి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాడు. గంగారమ్ సెపత్‌కు సుమారుగా 4 హెక్టార్ల భూమి ఉంది. అక్కడ అతను పాలీహౌస్‌లలో దోసకాయలను పండించాడు. 

పాలీహౌస్ వేగవంతమైన కీటకాలు, వ్యాధుల వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా బయోరేషనల్ రసాయనాలు, బయోకల్చర్‌లైన సూడోమోనాస్, ట్రైకోడెర్మాతో పాటు బ్యూవేరియా బాసియానా, మెటారిజియం ఎనిసోప్లీ వంటి బయోజెంట్లు పంటలకు రక్షణగా ఉపయోగించి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. అదనంగా అతను బ్రోకలీ, పాలకూర, చైనా క్యాబేజీ, ఎర్ర క్యాబేజీ వంటి అనేక కూరగాయలను పండిస్తున్నాడు.  నీటి కొరత ఉన్న తన గ్రామంలో నీటి సంరక్షణ కోసం 1 కోటి లీటర్ల నీటిని కలిగి ఉండే ఒక ఫామ్ పాండ్‌ను నిర్మించాడు. నీటిపారుదల కోసం,  రైతు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ఎంచుకున్నారు, స్ప్రింక్లర్ సిస్టమ్‌ల వినియోగాన్ని కనిష్టంగా ఉంచారు. 

ఇవి కూడా చదవండి

సుమారు 350 మంది రైతులను కలిగి ఉన్న కలఖాగ్రో నవ్‌ఫెడ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే ఎఫ్‌పీఓలో సెపాట్ క్రియాశీల సభ్యుడు. ముఖ్యంగా ఎఫ్‌పీఓ ద్వారా పంట రక్షణ పరిష్కారాలు, బయోకల్చర్‌లు మరియు విత్తనాలు వంటి ఇన్‌పుట్‌లను అందించే దుకాణాన్ని స్థాపించారు. సేపట్ ఫామ్ పాండ్, పాలీహౌస్ రెండింటికీ ప్రభుత్వ రాయితీలను పొందాయి. తన వ్యవసాయ ప్రయత్నాలను మరింత పెంచుకున్నానని పేర్కొన్నాడు. ఇలా వినూత్నంగా వ్యవసాయం చేయడం ద్వారా ఏడాదికి రూ.40 లక్షల టర్నోవర్ చేస్తున్నాని వివరించారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..