Aeroplane

ఎయిర్‌పోర్ట్ లేని దేశాలు ఏవో తెలుసా..

image

22 January 2025

Ravi Kiran

Aeroplane Landing

ఇటీవల ఏ దేశం చూసినా.. అందులోని చిన్న ప్రాంతాల్లో కూడా ఎయిర్‌పోర్టులు వచ్చేస్తున్నాయి. అయితే ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్ లేదు. 

Aeroplane Flying

ప్రపంచంలో ఇప్పటికీ 5 దేశాల్లో ఎయిర్ పోర్ట్ లేదు. స్థలాభావం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఇక్కడ విమానాశ్రయాలను నిర్మించలేదు.

Aeroplane

వాటికన్ సిటీలో ఎయిర్ పోర్ట్ లేదు. ఇక్కడికి సమీపంలోని రోమ్(ఇటలీ) విమానాశ్రయం నుంచి చేరుకుంటారు.

మరో దేశం లీచ్‌టెన్‌స్టెయిన్. ఈ దేశ ప్రజలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌ను ఆశ్రయిస్తారు. 

 ఇక అండోరా, మొనాకో, శాన్‌మారినో దేశాల ప్రజలు పక్క దేశాల్లోని విమానాశ్రయాల నుంచి చేరుకుంటారు. 

చూశారా.! ఈ దేశాల్లో ఇప్పటికీ ఎయిర్‌పోర్టులు నిర్మించలేదు. అక్కడున్న ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కనే ఉన్న దేశాలలోని ఎయిర్‌పోర్టులకు వెళ్తుంటారు.