సిగరెట్ మానేయడానికి వింత నిర్ణయం.. ఏం చేశాడంటే?

సిగరెట్ మానేయడానికి వింత నిర్ణయం.. ఏం చేశాడంటే?

Samatha J

|

Updated on: Jan 25, 2025 | 1:25 PM

ధూమపానం ఒక‌సారి అల‌వాటైతే మానేయడం చాలా కష్టం. ఈ వ్యస‌నం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొంద‌రు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో కొద్ది శాతం మాత్రమే దీని నుంచి బ‌య‌ట‌ప‌డడం జ‌రుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మ‌నం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఇదే కోవ‌కు చెందిన‌వాడు. సుమారు 11 సంవత్సరాల క్రితం త‌న‌కు ఉన్న ధూమపానం వ్యస‌నాన్ని మానేయడానికి ఆ వ్యక్తి ఒక వింత నిర్ణయం తీసుకోవ‌డంతో వార్తల్లో నిలిచాడు. త‌న త‌ల‌కు ఇనుప తీగ‌ల‌తో చేసిన బంతి లాంటి హెల్మెట్ ధ‌రిస్తున్నాడు.

 దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నాడు. తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ సిగ‌రెట్ తాగ‌డం మానేయ‌డానికి ఇలా వింత నిర్ణయం తీసుకున్నాడు. 2013 నుంచి అత‌డు ఇలాగే హెల్మెట్‌తోనే ద‌ర్శనమిస్తున్నాడు. అంత‌కుముందు 26 ఏళ్ల పాటు ఇబ్రహీం.. రోజుకు రెండు పెట్టెల సిగ‌రెట్లు తాగేవాడ‌ట‌. ప్రతీ సంవత్సరం తన ముగ్గురు పిల్లల పుట్టినరోజు, అతని వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానేసేవాడు. కానీ, ఆ త‌ర్వాత‌ మ‌ళ్లీ కొన్ని రోజుల‌కు తాగ‌డం చేస్తుండేవాడు. ఎలాగైనా ఈ వ్యస‌నం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకున్న ఇబ్రహీంకు ఓ వినూత్న ఆలోచ‌న వ‌చ్చింది. వెంట‌నే ఆ ఆలోచ‌న‌ను అమ‌లు చేశాడు. అప్పటి నుంచి ఇలా త‌న త‌ల‌కు బంతి లాంటి హెల్మెట్ ధ‌రించ‌డం చేస్తున్నాడు. ఇప్పటికీ అలాగే ఈ వింత హెల్మెట్‌తో ద‌ర్శనమిస్తూ వార్తల్లో నిలిచాడు.