కాఫీ తోటలో పని చేస్తున్న మహిళ.. అలికిడి విని పక్కకి చూడగానే షాక్!వీడియో
రక్తం మరిగిన బెబ్బులి... మరోసారి తన పంజా విసిరి ఓ మహిళను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తమిళనాడులోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పులులు, చిరుత పులులు జనావాసాల్లో సంచరిస్తూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. రక్తం రుచిమరిగిన ఈ మృగాలు జంతువులనే కాదు, మనుషును కూడా చంపేస్తున్నాయి. కారణమేదైనా అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనాల్లోకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. తాజాగా వయనాడ్ జిల్లాలో శుక్రవారం పెద్దపులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పని చేస్తున్న రాధ అనే మహిళపై పెద్దపులి దాడిచేసింది.
అనంతరం మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగిందంటూ చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మనుషులపై అడవి జంతువులు దాడి చేయడం తగ్గిందంటూ అటవీశాఖ మంత్రి శశీంద్రన్ అసెంబ్లీలో ప్రకటించిన మర్నాడే ఈ ఘటన చోటు చేసుకుంది. క్రూర మృగాలు తమపై చేస్తున్న దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ప్రజలు మనంతవాడి ఎమ్మెల్యే, కేరళ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పదేళ్లలో జంతువుల దాడిలో ఎనిమిది మంది మృతి చెందారన్నారు. ఎన్నిసార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపార. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

