Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు

Electric Vehicles 2025: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కూడా ఆటో ఎక్స్‌పో సందర్భంగా ప్రారంభించింది. క్రెటాలో కస్టమర్‌లు 2 బ్యాటరీ ఎంపికలను పొందుతారు. 42 kWh, 51.4 kWh. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే వాహనం పరిధి 473 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ పేర్కొంది..

Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 25, 2025 | 5:53 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ చాలా వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం 2024లో EV విక్రయాలకు సంబంధించి ఒక నివేదిక కూడా విడుదలైంది. దీని ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సుమారు 27 శాతం పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆటోమొబైల్ రంగంలోని కంపెనీలు కూడా వేగంగా తమ పోర్ట్‌ఫోలియోకు EVలను జోడిస్తున్నాయి.

దీనికి తాజా ఉదాహరణ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపిస్తుంది. ఎక్స్‌పోలో చాలా కంపెనీలు EV సెగ్మెంట్ వాహనాలను విడుదల చేశాయి. అదే సమయంలో చాలా మంది ఈవీ భవిష్యత్తు గురించి తమ ప్రణాళికను కూడా వ్యక్తం చేశారు. 2025 సంవత్సరం EV తయారీదారులకు చాలా ప్రత్యేకమైనది.

28 మోడల్‌లలో 18 EVలు:

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం 28 లాంచ్‌లు ఉన్నాయి. వాటిలో 18 మోడల్‌లు EVలు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది విడుదలైన ఈవీల సంఖ్య దాదాపు 4 రెట్లు ఎక్కువ. 2023, 2024లో వరుసగా 11, 15 కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలు, ICE లాంచ్‌లు జరిగాయి.

ఏ వాహనాలు తమ EV వాహనాలను ప్రవేశపెట్టాయి?

E-Vitara: మారుతి సుజుకి మొదటి EV కారు ఎక్స్‌పోలో విడుదల చేసింది. కంపెనీ E-Vitaraను భారతదేశానికి పరిచయం చేసింది. మార్చి 2025 నాటికి దీన్ని ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.

Tata Nexon EV బందీపూర్ ఎడిషన్‌ను కూడా ఎక్స్‌పో సందర్భంగా కంపెనీ ఆవిష్కరించింది. అయితే దీని ధరకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కూడా ఆటో ఎక్స్‌పో సందర్భంగా ప్రారంభించింది. క్రెటాలో కస్టమర్‌లు 2 బ్యాటరీ ఎంపికలను పొందుతారు. 42 kWh, 51.4 kWh. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే వాహనం పరిధి 473 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఈవీ విషయంలో కంపెనీల వైఖరి ఏమిటి?

ఈవీ మార్కెట్ విషయంలో కంపెనీల యజమానుల వైఖరి కూడా సానుకూలంగానే ఉంది. రాబోయే కాలంలో అన్ని కంపెనీలు తమ తమ ఈవీ మోడల్స్‌ను విడుదల చేయనున్నాయని కియా ఇండియా సీనియర్ ప్రెసిడెంట్, హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ చెప్పారు. అప్పుడు కస్టమర్లకు ఆప్షన్లు కూడా వస్తాయి. అన్ని కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోలో ఈవీ వాహనాలను జోడించడం ద్వారా అమ్మకాలను ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తున్నాయని మారుతీ సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టేకుచి చెప్పారు.

ఛార్జింగ్ సమస్యను ఎలా అధిగమించాలి?

ఈ సమస్యను పరిష్కరించడానికి మారుతి సుజుకి రాబోయే ఆర్థిక సంవత్సరంలో తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించే ముందు టాప్ 100 నగరాల్లోని తన డీలర్‌షిప్‌లలో 5 నుండి 10 కిలోమీటర్ల వరకు ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయడాన్ని పరిశీలిస్తోంది. అదే సమయంలో కొన్ని కంపెనీలు రాబోయే కొన్నేళ్లలో విడుదల చేయనున్న EV కార్ల కోసం స్థానిక సరఫరాదారులతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. 2030 నాటికి దేశంలోని ప్రధాన రహదారులపై 600 ఫాస్ట్ ఛార్జర్‌లను అమర్చేందుకు కూడా కృషి చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి