Bank Holidays: బిగ్ అలెర్ట్.! ఫిబ్రవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజులంటే.?
బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే నెలలో మీకు బ్యాంక్ పని ఉన్నట్లయితే.. ఫిబ్రవరి నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. పండగలు, వారాంతపు సెలవులతో కలిపి 14 రోజులు బ్యాంకులు బంద్. మరి అవి ఏయే రోజులోనో ఇప్పుడు తెలుసుకుందామా..
Updated on: Jan 25, 2025 | 7:04 PM


ఫిబ్రవరి 3వ తేదీన సరస్వతీ పూజ, ఫిబ్రవరి నెలలోనే తైపూసం, గురు రవిదాస్ జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, మహాశివరాత్రి వంటి అనేక పండుగలు ఉన్నాయి. వీటితో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవు క్యాలెండర్‌లో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో ఆ సెలవులు ఉన్నాయంటే..

ఫిబ్రవరి 02, ఆదివారం – బ్యాంకులకు వారంతపు సెలవు, ఫిబ్రవరి 03, సోమవారం – సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఫిబ్రవరి 08 రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే . ఫిబ్రవరి 09, ఆదివారం – బ్యాంకులకు వారాంతపు సెలవు. ఫిబ్రవరి 11, మంగళవారం – థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 12, బుధవారం – శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 16, ఆదివారం – బ్యాంకులకు వారాంతపు సెలవు. ఫిబ్రవరి 19, బుధవారం – ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు హాలిడే. ఫిబ్రవరి 20, గురువారం – మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్‌లు మూసి ఉంటాయి.

ఫిబ్రవరి 22, నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు. ఫిబ్రవరి 23, ఆదివారం వారాంతపు సెలవు. ఫిబ్రవరి 26, బుధవారం – మహా శివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 28, శుక్రవారం – లోసార్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

సెలవుల సమయంలో బ్యాంకింగ్ సేవలకు ఆన్ లైన్ లో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రజలు 24 గంటలూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ATMల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇవి 24 గంటలూ పని చేస్తాయి.





























