PAN Card: పాన్ కార్డుపై కూడా రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

PAN Card: పాన్ కార్డుపై కూడా రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

25 January 2025

image

Subhash

పర్మినెంట్ అకౌంట్‌ నంబర్‌ (PAN)ను ఆదాయపు పన్ను శాఖ మంజూరు చేస్తుంది. ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికీ ఒక నంబర్ కేటాయిస్తారు.

పర్మినెంట్ అకౌంట్‌ నంబర్‌ (PAN)ను ఆదాయపు పన్ను శాఖ మంజూరు చేస్తుంది. ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికీ ఒక నంబర్ కేటాయిస్తారు. 

పాన్ కార్డు

ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా అత్యంత అవసరమైన డాక్యుమెంట్. దీనిపై బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు, కొన్ని డిజిటల్ యాప్ లు లోన్లు మంజూరు చేస్తాయి. ముందుగా వాటిని గుర్తించాలి.

ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా అత్యంత అవసరమైన డాక్యుమెంట్. దీనిపై బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు, కొన్ని డిజిటల్ యాప్ లు లోన్లు మంజూరు చేస్తాయి. ముందుగా వాటిని గుర్తించాలి. 

రుణం

ముందుగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. రుణదాత వెబ్ సైట్ లో లేదా స్వయంగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు అందజేయవచ్చు.

ముందుగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. రుణదాత వెబ్ సైట్ లో లేదా స్వయంగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు అందజేయవచ్చు.

రుణం కోసం

అప్లికేషన్ లో మీ క్రెడిట్ స్కోర్, లోన్ వివరాలు, ఇతర సమాచారం పూర్తి చేయాలి. గుర్తింపు రుజువు కోసం మీ పాన్ కార్డును అప్ లోడ్ చేయాలి. కొన్నిసార్లు ఆధార్ కార్డును అడిగే అవకాశం ఉంది. 

క్రెడిట్ స్కోర్

మీరు అందించిన దరఖాస్తును ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పరిశీలిస్తాయి. ముందుగా మీ క్రెడిట్ స్కోర్ ను చూస్తాయి. అది మెరుగ్గా ఉంటే మీకు వెంటనే రుణం మంజూరవుతుంది. 

దరఖాస్తు

క్రెడిట్ చరిత్ర సక్రమంగా లేకుండా మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం కూాడా ఉంటుంది. బ్యాంకు మీ దరఖాస్తును ఆమోదించి, రుణం మంజూరు చేస్తే కొన్ని గంట్లలోనే మీ ఖాతాలో జమ అవుతుంది.

క్రెడిట్ చరిత్ర

కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తప్పకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు స్టేట్ మెంట్లు ఇవ్వాలని కోరతాయి. అదనంగా ష్యూరిటీ ఇస్తే రుణ మొత్తాన్ని పెంచేందుకు కూడా అంగీకరిస్తాయి. 

బ్యాంకులు

పాన్ కార్డుపై తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి. లేకుండా ఆలస్య చెల్లింపు చార్జీలు విధిస్తారు. అత్యవసర సమయంలో తక్కువ మొత్తంలో రుణం పొందటానికి పాన్ కార్డు ఉపయోగంగా ఉంటుంది.

పాన్ కార్డు