Tollywood: అబ్బబ్బ.. ఏం అందం.. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.?
ఎన్ని సినిమాలు చేసినా.. చాలామంది హీరోయిన్లకు స్టార్ స్టేటస్ అంత తొందరగా రాదు. ఆ హిట్ ఇచ్చే సినిమా పడితేనే గానీ.. ఆమె ఓవర్‌నైట్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ కొందరికి ఆ ఒక్క హిట్టు చిత్రం పడినా.. అదృష్టం కలిసిరాదు. ఆ కోవకు చెందిన భామ.. ఈ అమ్మడు. సినీ ఇండస్ట్రీలోకి..

చాలామంది హీరోయిన్లకు సినిమాలు ఎన్ని చేసినా కూడా.. స్టార్ స్టేటస్ ఓ పట్టాన రాదు. అలాగే ఓ హిట్ సినిమాలో నటించి.. ఓవర్‌నైట్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు లేకపోలేదు. అలాగే ఒక్క హిట్ పడినా కూడా.. అదృష్టం కలిసిరాని నటులు ఇంకొందరు ఉంటారు. ఆ కోవకు చెందిన భామే ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తి అయింది. బాక్సాఫీస్ దగ్గర రీ-సౌండింగ్ హిట్ సాధించింది. అయితేనేం ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తలుపు తట్టలేదు. మరి ఆ అప్సరస మరెవరో కాదు సంగీర్తన విపిన్.
ఈ కేరళ కుట్టి ‘నరకాసుర’ అనే చిత్రం ద్వారా 2023లో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో తమిళనాటకు వెళ్లింది ఈ అమ్మడు. తమిళంలో ‘హిగుటా’, ‘కదువెట్టి’ అనే రెండు చిత్రాల్లో నటించింది. అయితే అక్కడ కూడా సంగీర్తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఇక మళ్లీ గతేడాది ‘ఆపరేషన్ రావన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో ఈ సినిమా బాగానే ఆడింది. అయితే ఆ తర్వాత తెలుగులో సుహాస్ సరసన ‘జనక అయితే గనక’ అనే సినిమా సంగీర్తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాదు.. ఓవర్‌నైట్‌లోనే స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో అమ్మడు పక్కింటి అమ్మాయిలా కనిపించడమే కాదు.. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా సక్సెస్ తో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చిపడతాయని అందరూ ఊహించారు. కానీ అలా జరగలేదు. తెలుగులో ఈ అమ్మడి ఖాతాలో ప్రస్తుతం ఏ సినిమా లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది సంగీర్తన విపిన్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలను చూసేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



