22 January 2025
Subhash
హీరో మోటో కార్ప్ తన హీరో ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ (Hero Xtreme 250R) మోటారుసైకిల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో ఆవిష్కరించింది.
ఈ మోటారు సైకిల్ ధర రూ.1.80లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షాప్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది.
ఫిబ్రవరి నుంచి హీరో ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ (Hero Exteme 250R) మోటార్ సైకిల్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం అవుతాయని హీరో మోటో కార్ప్ తన సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేసింది.
మార్చి నుంచి మోటార్ సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ (Hero Xtreme 250R) మోటారు సైకిళ్లు మూడు రంగుల్లో లభిస్తాయి.
హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ మోటారు సైకిల్ ఆటో ఇల్ల్యూమినేషన్ క్లాస్ డీ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డీఆర్‌ఎల్స్, స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్, స్విచ్ఛబుల్ ఏబీఎస్, లాప్ టైమర్.
డ్రాగ్ టైమర్, మీడియా కంట్రోల్‌తోపాటు టర్న్ బై టర్న్ నేవిగేషన్‌ను అనుమతిస్తూ బ్లూటూత్ కనెక్టివిటీ మద్దతుతో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫీచర్లు.
ఫ్రంట్‌లో 43ఎంఎం యూఎస్డీ ఫోర్క్స్, రేర్ మోనోషాక్ యూనిట్ విత్ సిక్స్ స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్, రేర్‌లో రాడికల్ టైర్‌తోపాటు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్. డిస్క్ బ్రేక్స్.
మోటారు సైకిల్ ఆల్ న్యూ 250సీసీ డీవోహెచ్‌సీ, ఫోర్ వాల్వ్, సింగిల్ సిలిండర్ విత్ సిక్స్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్. కేవలం 3.25 సెకన్లలో గంటకు 60 కి.మీ వేగం.