PM Awas Yojana: ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పథకం ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద ఇల్లు కట్టుకునే వారికి సాయం చేస్తుందని చాలా మందికి తెలియదు. ఇటీవల కేంద్రం తన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పరిధిని, పరిమాణాన్ని విస్తరించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇప్పుడు దుకాణదారులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారని తెలుస్తుంది.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవాలని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణులు కూడా అనుకుంటూ ఉంటారు. ఇలా ఇల్లు కట్టుకునే వారికి కొన్ని ప్రత్యక పథకాల ద్వారా ప్రభుత్వాలు సాయం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద ఇల్లు కట్టుకునే వారికి సాయం చేస్తుందని చాలా మందికి తెలియదు. ఇటీవల కేంద్రం తన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పరిధిని, పరిమాణాన్ని విస్తరించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇప్పుడు దుకాణదారులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారని తెలుస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ హౌసింగ్’ మిషన్‌లో భాగమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం
గృహ రుణ సబ్సిడీని ఇంటి ధర, పరిమాణానికి బెంచ్‌మార్క్ చేయడాన్ని ప్రభుత్వం పరిగణించే అవకాశాలు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన దేశంలోని పౌరులందరికీ గృహాలను అందించడానికి 2015లో ప్రారంభించారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కింద రుణాలపై లబ్ధిదారులు సబ్సిడీని పొందారు. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను మూడు వర్గాలుగా విభజించారు . ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీనమైన విభాగం), ఎల్ఐజీ (తక్కువ ఆదాయ సమూహం), ఎంఐజీ (మధ్య ఆదాయ సమూహం)గా వర్గీకరించారు. హౌసింగ్ ఫర్ ఆల్ కోసం అసలు గడువు మార్చి 2022 ముగియగా అనంతరం డిసెంబర్ 2024 వరకు పొడిగించారు.
కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎంఏవై కోసం 66% ఖర్చును రూ.79,000 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కోవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ పీెం ఆవాస్ యోజన (గ్రామీన్) అమలు కొనసాగిందని, మూడు కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నామని స్పష్టం చేశారు. కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల ఉత్పన్నమయ్యే అవసరాలను తీర్చడానికి వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన రకాలు
కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాన్ని రెండు రకాలుగా విభజించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు పీఎం ఆవాస్ యోజన రూరల్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్
ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 4,000 పట్టణాలు, నగరాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ వంటి వర్గాలపై దృష్టి సారిస్తారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి పట్టణ ప్రాంతాల్లో సమగ్ర కవరేజీపై కేంద్రం దృష్టి సారిస్తోంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పౌరులందరికీ ఇళ్లను అందించడమే కేంద్రం లక్ష్యం. ఈ పథకం ఖర్చు భాగస్వామ్య నమూనాపై ఆధారపడి ఉంటుంది. లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించడానికయ్యే ఖర్చులను కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. ఖర్చులను పంచుకునే నిష్పత్తి మైదాన ప్రాంతాలకు 60:40, ఈశాన్య మరియు కొండ ప్రాంతాలకు 90:10గా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి