యాక్సిడెంట్‌కి గురైన సింగర్ విజయ్ ఏసుదాస్
లెజండరీ సింగర్ కేజే ఏసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ ఏసుదాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కేరళలోని అలప్పుళలో ఆయన సోమవారం రాత్రి విజయ్ ప్రయాణిస్తోన్న

Vijay Yesudas accident: లెజండరీ సింగర్ కేజే ఏసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ ఏసుదాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కేరళలోని అలప్పుళలో ఆయన సోమవారం రాత్రి విజయ్ ప్రయాణిస్తోన్న కారు మరో కారును ఢీకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏం కాలేదు. కొచ్చి నుంచి తిరువనంతపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే విజయ్ కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది. తాను సురక్షితంగా ఉన్నట్లు విజయ్ వెల్లడించారు. ( ఘనంగా సుధా కొంగర తనయ వివాహం.. హాజరైన మణిరత్నం, సూర్య)
కాగా ఏసుదాస్ వారసుడిగా సంగీత ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఏసుదాస్.. 20 ఏళ్లుగా పలు భాషల్లో పాడారు. అలాగే మారి మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి పడైవీరన్‌లో మెరిశారు. ప్రస్తుతం విజయ్ సాల్మాన్ అనే మల్టీలింగ్వల్ సినిమాలో నటిస్తున్నారు. ( అడివి శేషుకి అరుదైన గౌరవం)



