Akshay Kumar : స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆయన కూతురికి సైబర్ వేధింపులు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముంబై సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె నితారా కుమార్‌ను ఆన్‌లైన్‌లో వేధించిన కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ సైబర్ వేధింపులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) యశస్వి యాదవ్ మీడియాకు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో ముంబైలో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ పాల్గొన్నప్పుడు ఈ దిగ్భ్రాంతికర విషయాన్ని బయటపెట్టారు. తన 13 ఏళ్ల కుమార్తె ఆన్‌లైన్‌లో వీడియో గేమ్ ఆడుతుండగా, ఒక అపరిచితుడు ఆమెకు మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..
తన కుమార్తె ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి మేసేజ్ చేశాడని.. అసభ్యంగా మాట్లాడుతూ.. తన ఫోటోస్ పంపాలంటూ డిమాండ్ చేశాడని అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే నితారా ఏమాత్రం భయపడకుండా గేమ్‌ను ఆపేసి, తన తల్లికి విషయం చెప్పిందని.. అక్షయ్ కుమార్ వెంటనే ఈ విషయాన్ని సైబర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన కుమార్తె చూపిన ధైర్యం వల్లనే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందని అధికారులు ప్రశంసించారు.
ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..
లోతైన దర్యాప్తు తర్వాత నిందితుడిని మహారాష్ట్ర సైబర్ విభాగానికి చెందిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన అక్షయ్ కుమార్, పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ‘సైబర్ అవేర్‌నెస్ పీరియడ్’ను వారానికి ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..
ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!
