మూడేళ్ల డేటింగ్‌.. ఏడేళ్ల ఫ్రెండ్‌షిప్‌.. కాజల్ ప్రేమ కథ ఇదే

టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్ ఇటీవలే శ్రీమతి అయ్యారు. తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో తన మెడలో మూడు ముళ్లు వేయించుకున్నారు కాజల్‌.

మూడేళ్ల డేటింగ్‌.. ఏడేళ్ల ఫ్రెండ్‌షిప్‌.. కాజల్ ప్రేమ కథ ఇదే
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2020 | 1:34 PM

Kajal Gautam marriage: టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్ ఇటీవలే శ్రీమతి అయ్యారు. తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో తన మెడలో మూడు ముళ్లు వేయించుకున్నారు కాజల్‌. అయితే వ్యక్తిగత విషయాలను అత్యంత గోప్యంగా ఉంచే కాజల్‌, గౌతమ్‌ని ఎప్పుడు..? ఎక్కడ..? ఎలా కలిసింది..? అనే విషయాలను తెలుసుకునేందుకు ఆమె అభిమానులు చాలా ఆసక్తిని చూపుతున్నారు. ఇక కాజల్‌ పెళ్లి సమయంలో.. మా అక్క ప్రేమ కథను తానే ప్రపంచానికి చెబుతుందని నిషా వెల్లడించారు. ( రామ్‌తో మూడోసారి అనుపమ..!)

ఇక గౌతమ్‌ కిచ్లుతో తన స్నేహం ఎలా మొదలైందన్న విషయంపై కాజల్‌ ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. ”నాకు గౌతమ్ పదేళ్లుగా తెలుసు. మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నాము. ఆ తరువాత ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నాము. ఆ సమయంలో తాము ఒకరికి మరొకరు ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఇక ఈ లాక్‌డౌన్‌లో మేమిద్దరం కొన్ని వారాల పాటు కలుసుకోలేదు. ఆ సమయంలో ఒకరిని మరొకరం మిస్ అయ్యాము. దీంతో ఇకపై కలిసి ఉండాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నాం” అని కాజల్ చెప్పుకొచ్చారు. (‘కాఫీ విత్‌ సీఎం’.. గోవా ముఖ్యమంత్రి కొత్త ప్రోగ్రామ్‌)

కాగా మరోవైపు కాజల్ చేతినిండా ప్రస్తుతం సినిమాలు ఉన్నాయి. చిరంజీవి సరసన ఆచార్య, కమల్ సరసన ఇండియన్ 2లతో పాటు దుల్కర్ సల్మాన్ సరసన హే సినామిక, జాన్ అబ్రహం ‘ముంబయి సగ’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’లో కనిపించనున్నారు. (నాగశౌర్య మూవీకి ఆసక్తికర టైటిల్‌)