బలగం బ్యూటీ.. బబ్లీ క్యూటీ..! కవ్విస్తున్న కావ్య  కళ్యాణ్ రామ్ 

Rajeev 

02 May 2024

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తన నటనతో అందరిని ఆకట్టుకుంది 

2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు పరిసియమైన కావ్య కళ్యాణ్ రామ్ మంచిపేరు తెచ్చుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ , వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. 

 ఆ తర్వాత చదువుపై దృష్టి సారించిన ఆమె అడపాదడపా షార్ట్ ఫిలిమ్స్ తో పాటు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది.

హర్రర్ చిత్రం మసూదలో ఆమె ప్రధాన పాత్రతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఆ తర్వాత వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది . బలగం సినిమా కావ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

ప్రస్తుతం ఈ చిన్నది కొత్త సినిమా ఏది ఓకే చెయ్యలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు కవ్విస్తుంది. 

ఈ మధ్య గ్లామర్ షోతోనూ కవ్విస్తూ అభిమానులకు కిక్ ఇస్తుంది. ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.