నాగశౌర్య మూవీకి ఆసక్తికర టైటిల్‌

కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో

నాగశౌర్య మూవీకి ఆసక్తికర టైటిల్‌
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2020 | 11:13 AM

Naga Shaurya movie title: కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్ తరువాత ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఆసక్తికర టైటిల్‌ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. (షారూక్‌కి ‘బూర్జ్‌ ఖలీఫా’ స్పెషల్‌ విషెస్‌.. దగ్గరుండి వీక్షించిన కింగ్‌ఖాన్‌)

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం నాగశౌర్య మూవీకి ‘వరుడు కావలెను’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించినట్లు టాక్‌. కాగా ఈ మూవీ ప్రారంభించిన తరువాత చాలా రూమర్లు వచ్చాయి. నిర్మాతలకు, దర్శకురాలికి పడలేదని.. ఈ మూవీ ఆగిపోయిందని టాక్ నడిచింది. కానీ వాటిని నిర్మాతలు కొట్టివేశారు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,536 కొత్త కేసులు.. మూడు మరణాలు)