AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains in UAE: యుఏఈలో మళ్లీ వర్షం బీభత్సం.. రోడ్లు జలమయం, విద్యుత్ కు అంతరాయం.. ఆరెంజ్ అలర్ట్ జారీ

ఈ ఉదయం యుఎఇ ప్రజలు భారీ వర్షం ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తుఫాను కారణంగా చాలా మంది తమ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థులు కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా వాహనాలు రహదారి మధ్యలో చిక్కుకున్నాయి. 

Rains in UAE: యుఏఈలో మళ్లీ వర్షం బీభత్సం.. రోడ్లు జలమయం, విద్యుత్ కు అంతరాయం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Heavy Rains In Uae Again
Surya Kala
|

Updated on: May 03, 2024 | 9:40 AM

Share

సౌదీ అరేబియా, యుఏఈలో సాగుతున్న వాతావరణ విధ్వంసం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. గురువారం మళ్లీ భారీ వర్షం ప్రారంభమైన తర్వాత UAE అధికారులు దేశవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

ఈ ఉదయం యుఎఇ ప్రజలు భారీ వర్షం ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తుఫాను కారణంగా చాలా మంది తమ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థులు కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా వాహనాలు రహదారి మధ్యలో చిక్కుకున్నాయి.

ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు

కొన్ని రోజుల క్రితం UAE వాతావరణం మరింత దిగజార్చుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. మే 2వ తేదీ నుంచి నేడు అంటే మే 3వ తేదీ వరకు వాతావరణం మరింత దిగజారుతుందని అంచనా వేసింది. UAE ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో భద్రతా సలహాలను జారీ చేసింది. పాఠశాలలు  ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని, కంపెనీలు తమ ఉద్యోగస్తులకు ఇంటి నుంచి పని చేసే విధంగా వర్క్ ఇవ్వాలని కోరింది. పార్కులు , బీచ్‌లు మూసివేశారు. బస్సు సర్వీసులు, విమానయాన సంస్థలు కూడా దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి

అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షం

నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ (ఎన్‌ఎస్‌ఎం) జారీ చేసిన హెచ్చరిక ప్రకారం దేశంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దుబాయ్‌లో తెల్లవారుజామున 2.35 గంటల నుంచి మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నట్లు సమాచారం. ఈ నెల ప్రారంభంలో కురిసిన వర్షాల కంటే ఇప్పుడు కురుస్తున్న వర్షం ప్రమాదకరం కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

డెలివరీ సేవలో జాప్యం

UAE  ఆహారం, ఇంటికి వస్తువులను అందించే డెలివరీ సేవలు రైడర్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ కస్టమర్‌లకు డెలివరీ చేయడంలో జాప్యానికి సంబంధించిన నోటీసును కూడా జారీ చేశాయి. కొన్ని కంపెనీలు తమ సేవలను కూడా రద్దు చేశాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..