తగ్గేదేలే..సెంచరీ కొట్టేసిన రష్మిక మందన్నా..

TV9 Telugu

02 May 2024

ప్రస్తుతం సౌతిండియాలో ది మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా పేరే గుర్తుకు వస్తుంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కుర్రాళ్ల మనసులో నేషనల్ క్రష్ గా మారిపోయింది.  

ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ  వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటోందీ అందాల తార.

సినిమా షూటింగులతో ఎంత బిజిబిజీగా ఉంటున్నా ఫిట్ నెస్ కు తగిన సమయం కేటాయించుకోవడం రష్మిక మందన్నాకు అలవాటు.

అంతేకాదు జిమ్ లో తన వర్కవుట్‌ వీడియోలను తరచుగా సోషల్‌మీడియా లో షేర్‌ చేస్తుంటుంది రష్మిక. తాజాగా ఈ భామ ఏకంగా 100కిలోల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తిపడేసింది.

'కుబేర' సినిమా నైట్‌ షూట్స్‌తో చాలా బిజీగా ఉన్నా. ఉదయం 8గంటలకు హోటల్‌ రూమ్‌కి చేరుకున్నా. ఎందుకో తెలియదు కానీ నిద్రపట్టలేదు'

దాంతో పుస్తకం చదువుతూ కూర్చున్నా. మధ్యాహ్నం 12 గంటలకు నిద్రపోయి సాయంత్రం లేచాను. భోజనం పూర్తయ్యాక అర్థరాత్రి 1 గంటకు జిమ్‌కి వెళ్లాను.

'కార్డియో చేద్దామంటే మూడ్‌ రాలేదు. దీంతో వంద కిలోల డెడ్‌లిఫ్ట్‌ చేశాను. ఒక్కసారిగా టెన్షన్ మొత్తం మాయమైపోయింది’ అని ఈ వీడియోను షేర్ చేసింది రష్మిక.