AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leela Naidu: ఆమె అందానికి దేశమే ఆశ్చర్యపోయింది..14 ఏళ్లకే మిస్ ఇండియాగా తెలుగమ్మాయి.. చివరకు ఒంటరిగా..

పేరు లీలా నాయుడు. అచ్చ తెలుగమ్మాయి. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమె అందానికి అవాక్కయ్యింది. కేవలం 14 ఏళ్లకు మిస్ ఇండియా విజేతగా నిలిచింది. ఆమెతో సినిమా చేయాలని రాజ్ కపూర్ నాలుగు సార్లు ఆఫర్ చేశారు. తొలి చిత్రానికి జాతీయ అవార్డ్ అందుకుంది. కానీ రంగుల ప్రపంచంలో ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని ఒంటరిగా మార్చేశాయి

Leela Naidu: ఆమె అందానికి దేశమే ఆశ్చర్యపోయింది..14 ఏళ్లకే మిస్ ఇండియాగా తెలుగమ్మాయి.. చివరకు ఒంటరిగా..
Leela Naidu
Rajitha Chanti
|

Updated on: May 03, 2024 | 9:56 AM

Share

ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల జాబితాలో ఆమె ఒకరు. దాదాపు పదేళ్లు భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక చేదు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ హీరోయిన్ పేరు లీలా నాయుడు. అచ్చ తెలుగమ్మాయి. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమె అందానికి అవాక్కయ్యింది. కేవలం 14 ఏళ్లకు మిస్ ఇండియా విజేతగా నిలిచింది. ఆమెతో సినిమా చేయాలని రాజ్ కపూర్ నాలుగు సార్లు ఆఫర్ చేశారు. తొలి చిత్రానికి జాతీయ అవార్డ్ అందుకుంది. కానీ రంగుల ప్రపంచంలో ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని ఒంటరిగా మార్చేశాయి. మానసిక వేదన భరించలేక మద్యానికి బానిసై 2009లో మరణించింది.

లీల నాయుడు తండ్రి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన భైతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు. పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో అక్కడ పరిచయమైన ఫ్రెంచ్ కు చెందిన మార్తాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే లీలా నాయుడు. ముంబైలో జన్మించిన లీలా స్విట్జర్లాండ్‌లో విధ్యాబ్యాసం పూర్తిచేసింది. చిన్నప్పుడే నటనపై ఆసక్తి ఉండడంతో ఫ్రెంచ్ నటుడు జీన్ రేనా దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. అదే సమయంలో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతున్న లీలాకు రాజ్ కపూర్ నాలుగుసార్లు తన సినిమాలను ఆఫర్ చేయగా చదువు కారణంగా రిజెక్ట్ చేసింది.

Leela

Leela

ఆమె అందానికి ముగ్దుడైన ఒబెరాయ్ హోటల్ గొలుసు యజమాని మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్‌ లీలాను వివాహం చేసుకున్నాడు. పెళ్లి నాటికి లీల వయసు 17 ఏళ్లు మాత్రమే. కానీ తిలక్ రాజ్ లీలా కంటే 16 సంవత్సరాలు పెద్దవాడు. వీరికి కవలలు జన్మించారు. కానీ రెండేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. పిల్లల సంరక్షణ తిలక్ తీసుకున్నాడు. విడాకుల తర్వాత హృషికేశ్ ముఖర్జీ చిత్రం అనురాధతో సినిమాల్లోకి అడుగుపెట్టింది లీలా. తొలి చిత్రానికి జాతీయ అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసింది. ఆమె నటించిన సినిమాలు హిట్ కాకపోయినా ఆమె అందం కారణంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రచయిత డోమ్ మోరియాస్‌ను రెండో వివాహం చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరి బంధం ముగిసిపోయింది.

Leela 1

Leela 1

రెండో పెళ్లి, విడాకుల కారణంగా లీలా మానసిక క్షోభకు గురైంద. దీంతో ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని తన విలాసవంతమైన భవనంలో ఒంటరిగా జీవించింది. ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం ఆవిరైపోయింది. దీంతో తన ఇంట్లోని గదులను అద్దెకు ఇచ్చింది. పేదరికం, ఒంటరితనంతో బాధపడిన లీల మద్యానికి బానిసైంది. చివరకు 2009 జూలై 28న ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో మరణించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.