AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడిసి కొట్టిన స్టార్ హీరో సినిమా.. దెబ్బకు అడ్రస్ లేకుండాపోయిన దర్శకుడు, హీరోయిన్

ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. చిన్న సినిమాలు కూడా ఊహించని విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు భారీ అంచనాలు మధ్య విడుదలై దారుణంగా నిరాశపరుస్తున్నాయి.

బెడిసి కొట్టిన స్టార్ హీరో సినిమా.. దెబ్బకు అడ్రస్ లేకుండాపోయిన దర్శకుడు, హీరోయిన్
Movie News
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2025 | 9:03 AM

Share

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ సహజం.. హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటారు. కానీ సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ఆ హీరోయిన్, దర్శకుడి కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ హీరోలు మాత్రం ఎదో ఒక దర్శకుడితో నెక్స్ట్ సినిమాను ఓకే చేసుకుంటుంటారు. అయితే ఇండస్ట్రీలో ఓ బడా హీరో సినిమా దెబ్బకు దర్శకుడు, హీరోయిన్ అడ్రస్ లేకుండా పోయారు. ఆ దర్శకుడు ఏకంగా సినిమాలు మానేశాడు కూడా.. కానీ ఆ హీరో మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా రాణిస్తున్నాడు. అతని సినిమాలు ఇప్పుడు వందల కోట్లు రాబడుతున్నాయి. ఇంతకూ ఆ హీరో ఎవరు. కనిపించకుండా పోయిన ఆ హీరోయిన్ ఎవరు .? సినిమాలు మానేసిన ఆ దర్శకుడు ఎవరు.? ఇప్పుడు చూద్దాం.!

ఈమధ్య మన సినిమాల్లో హాలీవుడ్ టెక్నీషన్స్ ను, హాలీవుడ్ నటులను ఎక్కువగా వాడుతున్నారు. కానీ అప్పట్లోనే ఓ హాలీవుడ్ హీరోయిన్ తో సినిమా చేశాడు ఓ స్టార్ హీరో. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఎంతలా అంటే ఆ దర్శకుడు దెబ్బకు సినిమాలు మానేసేంతలా.. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన మారిగోల్డ్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ సినిమాలు హాలీవుడ్ దర్శకుడు విల్లార్డ్ కరోల్ దర్శకత్వం వహించాడు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ భామ అలీ లార్టర్ సల్మాన్ కు జోడీగా నటించింది. అప్పట్లో ఈ సినిమా బిగెస్ట్ డిజాస్టర్. సల్మాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ ఫ్లాప్ మూవీ ఇది. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కించాడు దర్శకుడు విల్లార్డ్ కరోల్. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ హాలీవుడ్ నటిది ఇక్కడి డాన్స్ మాస్టర్ ను ప్రేమించడం.. హీరో ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబాన్ని  ఒప్పించడానికి చేసే ప్రయత్నం.. ఇంతలో ఊహించని విధంగా అమెరికా నుంచి ఆ హాలీవుడ్ నటి లవర్ రావడం.. చివరకు ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుంటుంది అనేది కథ. ఇక ఈ సినిమా  డిజాస్టర్ అవడంతో దర్శకుడు మరో సినిమా చేయలేదు. అసలు ఎక్కడా కనిపించలేదు కూడా.. అలాగే హీరోయిన్ గా చేసిన అలీ లార్టర్ ఆతర్వాత ఇండియాకు రాలేదు. ఇండియన్ సినిమాలు చేయలేదు. హాలీవుడ్ లోనే  పలు సినిమాలు, టీవీ షోలు చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి