AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్జీవీది, ఆ అమ్మాయిది వీడియో పంపి.. అతనితో జాగ్రత్త అన్నారు.. ఆరాధ్యదేవి షాకింగ్ కామెంట్స్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ.. అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది

ఆర్జీవీది, ఆ అమ్మాయిది వీడియో పంపి.. అతనితో జాగ్రత్త అన్నారు.. ఆరాధ్యదేవి షాకింగ్ కామెంట్స్
Rgv
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2025 | 10:08 AM

Share

సంచలన డ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మొన్నటివరకు కాంట్రవర్సీలతో సావాసం చేసిన వర్మ ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. మొన్నామధ్య మంచి సినిమాలు చేస్తా అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆర్జీవీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఆర్జీవీ ఇన్ స్టా గ్రామ్ సెన్సేషన్ ను వెతికి మరి పట్టుకున్నారు. కేరళలో ఎక్కడో రీల్ చేసుకునే ఒక అమ్మాయి అందానికి ఫిదా అయిన ఆర్జీవీ ఆమెను వెతికి పట్టుకొని మరీ ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమా చేశారు. చీరకట్టులో ఆమె చేసే రీల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకేనేమో సినిమా పేరు కూడా శారీ అని పెట్టారు ఆర్జీవీ.

ఇక ఈ సినిమా ఆ అనౌన్స్ చేసిన ఆ దగ్గర నుంచి ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు వర్మ. ఆమె అందాలను రకరకాలుగా చూపిస్తూ ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. శారీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే ఆరాధ్య దేవి అందానికి ఆడియన్స్ ముఖ్యంగా కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. తాజాగా ఆరాధ్య దేవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ ఇంటర్వ్యూలో ఆరాధ్య దేవి మాట్లాడుతూ.. ఆర్జీవీ ఆఫర్ గురించి ఆమె చెప్తూ.. మొదట్లో ఆర్జీవీ ఎవరో నాకు తెలియదు. ఆయన నన్ను వెతుకుతున్నారు అని తెలిసి నా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోయింది.  నా ఇన్ స్టా ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆశ్చర్యపోయా.. ఆతర్వాత ఆయన నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత ఆర్జీవీ గురించి చాలా మంది గొప్పగా చెప్పారు. అలాగే కొంతమంది బ్యాడ్ గానూ చెప్పారు అని తెలిపింది.  అలాగే మరికొంతమంది అషురెడ్డితో ఆర్జీవీ వీడియో పంపించి.. అతని గురించి బ్యాడ్ గా చెప్పారు. అతనితో జాగ్రత్త, ఆయనతో సినిమాలు చేయకు అంటూ సలహాలు కూడా ఇచ్చారు. కానీ నేను ఆయనను కలిసిన తర్వాత సినిమా గురించి చాలా క్లారిటీగా చెప్పారు. అంతే కాదు ఈ సినిమాలో నేను చేసిన సీన్స్ అన్ని ఎంతో కంఫర్ట్ గానే చేశాను అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..