‘మైత్రీ’లో చీలికలు.. తప్పుకున్న ఆ నిర్మాత.. సాక్ష్యం ఇదే..!

మైత్రీ మూవీ మేకర్స్.. టాలీవుడ్‌లో ప్రముఖ బడా నిర్మాణ సంస్థల్లో ఇదొకటి. నవీన్, రవిశంకర్, మోహన్ చెరుకూరిలు భాగస్వాములుగా ఈ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగెట్టిన ఈ నిర్మాణ సంస్థ.. అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ‘మైత్రీ’ అన్న పేరుకు తగ్గట్లుగా దర్శకులు, హీరోలతో మంచి సంబంధాలను పెంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ నిర్మాణ సంస్థ. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలో […]

'మైత్రీ'లో చీలికలు.. తప్పుకున్న ఆ నిర్మాత.. సాక్ష్యం ఇదే..!

మైత్రీ మూవీ మేకర్స్.. టాలీవుడ్‌లో ప్రముఖ బడా నిర్మాణ సంస్థల్లో ఇదొకటి. నవీన్, రవిశంకర్, మోహన్ చెరుకూరిలు భాగస్వాములుగా ఈ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగెట్టిన ఈ నిర్మాణ సంస్థ.. అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ‘మైత్రీ’ అన్న పేరుకు తగ్గట్లుగా దర్శకులు, హీరోలతో మంచి సంబంధాలను పెంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ నిర్మాణ సంస్థ. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌ల సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రొడక్షన్ హౌస్‌లో చీలిక వచ్చినట్లు అర్థమవుతోంది.

ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఉప్పెన నుంచి ఫస్ట్‌ వేవ్ పేరుతో ఓ టీజర్ ఇవాళ విడుదలైంది. అందులో నిర్మాతలుగా నవీన్, రవి శంకర్ పేర్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు గత ఏడాది జరిగిన అల్లు అర్జున్-సుకుమార్ సినిమా పూజా కార్యక్రమంలోనూ మోహన్ చెరుకూరి కనిపించలేదు. దీంతో ఈ నిర్మాణ సంస్థ నుంచి అతడు బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? మైత్రీలో నిజంగానే చీలికలు వచ్చాయా..? మోహన్ చెరుకూరి ఎందుకు బయటకు వెళ్లారు..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే గతంలోనూ ఓ సారి ఈ నిర్మాణ సంస్థలో చీలికలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీని నుంచి బయటకు వెళ్లి సొంత నిర్మాణ సంస్థను పెట్టుకునేందుకు నిర్మాత నవీన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆయన కొట్టిపారేశారు. తనకు సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకునే ఉద్దేశం లేదని నవీన్ చెప్పిన విషయం తెలిసిందే.

Published On - 2:11 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu