మళ్లీ జత కట్టబోతోన్న నాని-చిన్ని..?

నాని, సాయి పల్లవి.. సహజంగా నటించడంలో ఈ ఇద్దరు ఒకరికి మరొకరు పోటీ. ఆ పోటీ ఎలా ఉంటుందనేది ఇదివరకే టాలీవుడ్ ప్రేక్షకులు చూసేశారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన ఎమ్‌సీఏ చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ చిత్రంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అన్ని కుదిరితే ఈ ఇద్దరు మళ్లీ జోడీ కట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో […]

మళ్లీ జత కట్టబోతోన్న నాని-చిన్ని..?

నాని, సాయి పల్లవి.. సహజంగా నటించడంలో ఈ ఇద్దరు ఒకరికి మరొకరు పోటీ. ఆ పోటీ ఎలా ఉంటుందనేది ఇదివరకే టాలీవుడ్ ప్రేక్షకులు చూసేశారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన ఎమ్‌సీఏ చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ చిత్రంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అన్ని కుదిరితే ఈ ఇద్దరు మళ్లీ జోడీ కట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే చిత్రంలో నాని నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ చిత్రానికి నాని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీత్య్రన్‌కు నాని ఓకే చెప్పినట్లు టాక్. ఇక దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు వేగంగా జరుగుతుండగా.. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం సాయి పల్లవిని కలిశారట దర్శకుడు. కథపై ఈ మలార్ బ్యూటీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుండగా.. డేట్లపై మాత్రం ఇంకా స్పష్టను ఇవ్వనున్నట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కు ఆమె ఒప్పుకుంటే.. నాని-చిన్ని జోడీని మరోసారి చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి ఏ హీరోను రిపీట్ చేయని విషయం తెలిసిందే.

Published On - 1:31 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu