మనసుకు హత్తుకుంటోన్న ‘ఉప్పెన’ ఫస్ట్ వేవ్

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. లెక్కల మాస్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఉప్పెన ఫస్ట్ వేవ్ పేరుతో తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో హీరో, హీరోయిన్లను కనిపించి, కనిపించకుండా చూపించారు. హీరో బేబమ్మా.. అంటూ హీరోయిన్‌పై తన […]

మనసుకు హత్తుకుంటోన్న 'ఉప్పెన' ఫస్ట్ వేవ్

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. లెక్కల మాస్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఉప్పెన ఫస్ట్ వేవ్ పేరుతో తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో హీరో, హీరోయిన్లను కనిపించి, కనిపించకుండా చూపించారు. హీరో బేబమ్మా.. అంటూ హీరోయిన్‌పై తన ప్రేమను చెబుతూ వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే టీజర్‌కు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. సందాట్ సైనుదీన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మొత్తానికి ఫస్ట్‌వేవ్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచాడు వైష్ణవ్ తేజ్.

ఇక ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu