నిలిచిపోయిన హీరో విజయ్‌ షూటింగ్.. ఐటీ దాడులు!

చెన్నైలోని దాదాపు ఐదుగంటల నుంచి తమిళ స్టార్ హీరో విజయ్ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ స్పాట్‌కి వెళ్లి మరీ.. ఆయనకి సంబంధించిన వ్యవహారాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్ టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ సినిమా, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్‌లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాస్టర్ సినిమా షూటింగ్‌లో ఉన్న హీరో విజయ్‌ని విచారిస్తున్న ఐటీ అధికారులు. బిగిల్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? […]

నిలిచిపోయిన హీరో విజయ్‌ షూటింగ్.. ఐటీ దాడులు!

చెన్నైలోని దాదాపు ఐదుగంటల నుంచి తమిళ స్టార్ హీరో విజయ్ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ స్పాట్‌కి వెళ్లి మరీ.. ఆయనకి సంబంధించిన వ్యవహారాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్ టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ సినిమా, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్‌లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాస్టర్ సినిమా షూటింగ్‌లో ఉన్న హీరో విజయ్‌ని విచారిస్తున్న ఐటీ అధికారులు. బిగిల్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? ఇతర లావాదేవీలపైన మూడు గంటలుగా విజయ్‌ని విచారిస్తున్న అధికారులు. లోకేష‌న్‌లోనే ఐటీ అధికారులు విజయ్‌ని ప్రశ్నింస్తున్నారు. దీంతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది.

కాగా గత కొద్ది రోజుల ముందు కర్నాటకలోని విరాజ్‌పేటలో హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. లెక్కకు రాని డాక్యుమెంట్లను, ఆస్తులను, నగదుని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటన చోటుచేసుకున్న కొద్ది రోజుల్లోనే.. తమిళ మాస్ హీరో విజయ్‌పై ఐటీ అధికారులు దాడులు చేయడంతో తమిళ పరిశ్రమలో కలకలం పుట్టిస్తోంది.

Published On - 5:24 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu