మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ఉచిత హై స్పీడ్ వైఫై

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ‘మేడారం సమ్మక్క-సారక్క జాతరకు’పేరు ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతరను రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. కాగా ఇప్పటికే మేడారం ప్రాంతం.. జనసంద్రోహాన్ని తలపిస్తోంది. ఈ జాతరను లక్షల్లో భక్తులు పాల్గొని, గిరిజన దేవతలను దర్శించుకుంటారు. కాగా.. ఇప్పటికే ఈ జాతరను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ముమ్మర ఏర్పాట్లను చేసింది. భక్తులకు […]

మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ఉచిత హై స్పీడ్ వైఫై

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ‘మేడారం సమ్మక్క-సారక్క జాతరకు’పేరు ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతరను రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. కాగా ఇప్పటికే మేడారం ప్రాంతం.. జనసంద్రోహాన్ని తలపిస్తోంది. ఈ జాతరను లక్షల్లో భక్తులు పాల్గొని, గిరిజన దేవతలను దర్శించుకుంటారు.

కాగా.. ఇప్పటికే ఈ జాతరను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ముమ్మర ఏర్పాట్లను చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తున్నారు. అయితే ఈ సందర్భంగానే.. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రభుత్వం రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్ శుభవార్త తెలిపింది. ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, భక్తులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, దీని కోసం 20 వైఫై హాట్ స్పాట్లను ఏర్పాట్లు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు స్పష్టం చేశారు. కాాగా ఈ జాతర ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది.

మొదటిరోజు: ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. రెండోవరోజు: ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది. మూడవరోజు: ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నాల్గువరోజు: ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

Published On - 4:56 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu