కేసీఆర్ ముంగిట మంద కృష్ణ డిమాండ్లు ఇవే

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉప్పు నిప్పులా వుండే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆయన ముందు కొత్త డిమాండ్లను ప్రస్తావించారు. ఈ డిమాండ్లను నేరుగా కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరవేశారు. శుక్రవారం నాడు కేసీఆర్ మేడారం జాతర సందర్శనకు వెళుతున్న తరుణంలో మంద కృష్ణ కొత్త డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. మేడారం జాతర నేపథ్యంలో మంద కృష్ణ మూడు ప్రధాన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుపెట్టారు. మేడారం […]

కేసీఆర్ ముంగిట మంద కృష్ణ డిమాండ్లు ఇవే

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉప్పు నిప్పులా వుండే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆయన ముందు కొత్త డిమాండ్లను ప్రస్తావించారు. ఈ డిమాండ్లను నేరుగా కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరవేశారు. శుక్రవారం నాడు కేసీఆర్ మేడారం జాతర సందర్శనకు వెళుతున్న తరుణంలో మంద కృష్ణ కొత్త డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది.

మేడారం జాతర నేపథ్యంలో మంద కృష్ణ మూడు ప్రధాన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుపెట్టారు. మేడారం ప్రాంతం వున్న ములుగును ప్రత్యేక జిల్లాగా చేయాలన్నది ఆయన మొదటి డిమాండ్. యాదాద్రిని వేయి కోట్లతో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి అంతే మొత్తాన్ని మేడారానికి కేటాయించాలన్నది మంద కృష్ణ రెండో డిమాండ్.

బతుకమ్మ పండుగలాగానే మేడారం జాతర సందర్భంగా సెలవులు ప్రకటించాలని, మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్ల చిట్టాను సీఎస్ సోమేశ్ కుమార్‌కు అందజేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu