Singer Sunitha: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత.. మీకు దండంరా నాయనా అంటూ..
Singer Sunitha: ఏమంటూ సోషల్ మీడియా (Socialmedia) విస్తృతి పెరిగిందో. నిజాలతో పాటు అబద్ధాలు, పుకార్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు వ్యవహారం మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు...
Singer Sunitha: ఏమంటూ సోషల్ మీడియా (Socialmedia) విస్తృతి పెరిగిందో. నిజాలతో పాటు అబద్ధాలు, పుకార్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు వ్యవహారం మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు చేసిన పోస్ట్‌లకు రకరకాల భాష్యాలను చెబుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాము ఒకటి తలచి పోస్ట్ చేస్తే అది సోషల్ మీడియాలో మరోలా మారుతోంది. తాజాగా సింగర్ సునీత కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండే సునతీ మామిడి తోటలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘Blessed’ అంటూ క్యాప్షన్ జోడించారు.
ఇంకేముంది మామిడి పండ్లను చూపిస్తూ ఫొటోకి పోజ్‌లు ఇవ్వడంతో పుకార్లకు ఊతమిచ్చినట్లైంది. దీంతో సునీత తల్లి కాబోతోంది అనే వార్త వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం సదరు ఫోటోకి కాంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేశారు. సునీత ఫోటోలను ఇలా పోస్ట్ చేశారో లేదో అలా వైరల్ అయ్యింది. ఈ వార్త చివరికి సునీత వద్దకు చేరింది. తనపై జరుగుతోన్న ప్రచారం దృష్టికి రావడంతో సునీత ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.
సునీత తల్లికాబోతోందా.? అని ప్రచురితమైన వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ..’మా తోటలో పండిన తొలి మామిడి పంటకు సంబంధించి ఫొటోను పోస్ట్ చేస్తే ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించారు. ఇలాంటి పుకార్ల వ్యాప్తిని అపేయండి’ అంటూ దండం రా నాయనా అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో సునీత విషయంలో జరుగుతోన్న ప్రచారానికి చెక్ పడినట్లైంది.
సునీత ఫేస్‌బుక్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Back Pain: వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. ఈ 6 ఇంటి చిట్కాలు పాటిస్తే బెటర్..