Acharya Pre Release Event Live: థియేటర్లలో సందడి చేయనున్న ఆచార్య.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్..
Chiranjeevi, Ram Charan Acharya Pre Release: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.
Chiranjeevi, Ram Charan Acharya Pre Release: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. మెగాస్టార్… మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలిసి చేయబోయే అద్భతాన్ని చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో చూస్తున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఆచార్య సినిమా. ఈ క్రమంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈరోజు సాయంత్రం యూసఫ్ గూడలోని టీఎస్పీఎస్సీ 1వ బెటాలియన్ మైదానంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను టీవీ 9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు..
LIVE NEWS & UPDATES
-
రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. నిరంజన్ రెడ్డి..
ఆచార్య సినిమా కోసం చిరంజీవి, రామ్ చరణ్ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు ప్రొడ్యసర్ నిరంజన్ రెడ్డి. ఆచార్య సినిమా విడుదల తర్వాత హిట్ అయితేనే రెమ్యూనరేషన్ తీసుకుంటామని చెప్పారన్నారు.
-
ఆకట్టుకుంటున్న ట్రైలర్..
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఆచార్య ట్రైలర్‌ను మరోసారి స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు నిర్వహకులు. స్టోరీ సెంట్రల్ పాయింట్ ధర్మస్థలి గురించి చెర్రీతో ఇప్పించిన ఇంట్రడక్షన్‌తో మొదలవుతుంది ఆచార్య ట్రైలర్. తర్వాత చిరూ ఇచ్చిన సాలిడ్ ఎంట్రీ కంటెట్‌కి బలం పెంచుతుంది. వచ్చానని చెప్పాలనుకున్నా.. కానీ.. చెయ్యడం మొదలుపెడితే.. అంటూ విలన్‌ని హెచ్చరించే మెగా డైలాగ్స్ ఓకే అనిపించాయి.
-
-
ప్రొడ్యూసర్ ప్రసాద్ కామెంట్స్..
ప్రపంచం మాట్లాడుకునే స్థిథితి తెలుగు సినిమా వచ్చిందన్నారు ప్రొడ్యూసర్ ప్రసాద్. ఆచార్య సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డారన్నారు. ఇండస్ట్రీ ఈరోజు బతికింది అంటే చిరంజీవి వల్లే అన్నారు.
-
భలే భలే బంజారా వీడియో సాంగ్ లాంచ్..
నిర్మాత డీవీవీ దానయ్య… మైత్రీ మూవీ మేకర్స్ రవి.. ప్రోడ్యూసర్ రామరావు.. ప్రసాద్ నలుగురు భలే భలే బంజారా వీడియో సాంగ్ లాంచ్ చేశారు.
-
సాన కష్టం వీడియో లాంచ్..
గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా సాన కష్టం వీడియో సాంగ్ చేశారు.. అనంతరం.. ఆచార్య చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
-
-
నీలాంబరీ వీడియో సాంగ్ లాంచ్..
అత్యధిక మిలియన్ వ్యూస్ అందుకున్న నీలాంబరీ వీడియో పాటను లాంచ్ చేశారు డైరెక్టర్ మెహర్ రమేష్..
-
గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్..
ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్దకు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి..
-
ఆచార్య వచ్చేశాడు..
మెగాస్టార్ చిరంజీవితోపాటు.. డైరెక్టర్ రాజమౌళి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విచ్చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జక్కన్న వచ్చాడు..
-
బంజారా పాటకు స్టెప్పులేసిన ఫైట్ మాస్టర్స్..
బంజారా పాటకు తమదైన స్టైల్లో స్టెప్పులేశారు ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు.. మరోవైపు.. వేదిక వద్దకు చేరుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ.. డైరెక్టర్ బాబీ
-
ఆచార్య అంటే మెగాస్టార్ చిరంజీవి గారే.. రామజోగయ్య శాస్త్రి.
ఆచార్య అన్న ఒక్క మాటకు మెగాస్టా్ర్ చిరంజీవి గారే గుర్తొస్తారన్నారు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కు పెట్టింది పేరు మణిశర్మగారు.. లాహే లాహే పాటకు చిరంజీగారు స్టెప్పులేయడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు రామజోగయ్య శాస్త్రి.. అద్బుతాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నన్నారు రామజోగయ్య శాస్త్రి.
-
సిద్ధా ఎంట్రీ టీజర్..
దర్మస్థలికి ఆపద వస్తే.. జయించడానికి మాలో అమ్మోరు తల్లి ఆవహిస్తుంది అంటూ ఎంట్రీ ఇచ్చేశాడు సిద్ధా.. రామ్ చరణ్ టీజర్ ఆకట్టుకుంటుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై మరోసారి అలరించాడు సిద్ద..
-
ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానుల సందడి…
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై మెగా అభిమానులు సందడి షూరు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా పాటలను ఆలపిస్తూ తెగ ఎంజాయ్ చేస్తుండగా.. మరోవైపు భారీగా సినీ ప్రియులు విచ్చేస్తున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా చిరు పాటలకు స్టెప్పులేస్తున్నారు.
-
అమ్మ కల.. రామ్ చరణ్..
నాన్నా.. నేను పూర్తిస్థాయిలో కలిసి ఓ సినిమా చేయాలనేది అమ్మ కోరిక అని ఇటీవల రామ్ చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. రాజమౌళితో మాట్లాడాలని చిరంజీవి గారిని కోరిందని.. దీంతో జక్కన్న సైతం ఆచార్య సినిమా చేసేందుకు కాల్షీటు వెసులుబాటు కల్పించారని తెలిపారు చరణ్.
-
ఆచార్య సెన్సార్ పూర్తి..
ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆచార్య సినిమా. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మొదలెట్టేంది చిత్రయూనిట్. ఓవైపు ఈరోజు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా.. మరోవైపు.. ఆచార్య సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిపికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. 2 గంటల 46 నిమిషాలుగా సినిమా రన్ టైమ్ లాక్ చేశారు.
-
ఆచార్య రన్ టైమ్ ఎంతంటే…
చిరంజీవి.. చరణ్.. మాస్ డైరెక్టల కొరటాల శివ కలిసి ఆచార్య సినిమాతో మెగా అభిమానులను ఫుల్ మీల్స్ ఇవ్వనున్నారు.. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయిందని సమాచారం. 166 నిమిషాలు అంటే 2 గంటల 46 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుందట.
-
అంచనాలను పెంచేసిన ట్రైలర్..
ఇటీవల విడుదలైన ఆచార్య ట్రైలర్ ఓవైపు యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. మెగా అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యింది ట్రైలర్.. వచ్చానని చెప్పాలనుకున్నా.. కానీ.. చెయ్యడం మొదలుపెడితే.. అంటూ విలన్‌ని హెచ్చరించే మెగా డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి.
-
మొదలైన హంగామా..
ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌తో ఇప్పటికే యూసఫ్ గూడలో భారీ హంగామా మొదలైంది. మెగా అభిమానులే కాకుండా.. సినీ ప్రియులు ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్దకు భారీగా వచ్చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో సందడి చేయనుంది.
Published On - Apr 23,2022 5:56 PM