ఎస్పీబీ గారికి కరోనా సోకడానికి నేను కారణం కాదు: మాళవిక

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకడానికి తాను కారణం కాదని సింగర్ మాళవిక అన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 6:14 pm, Fri, 21 August 20
ఎస్పీబీ గారికి కరోనా సోకడానికి నేను కారణం కాదు: మాళవిక

Singer Malavika video: ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకడానికి తాను కారణం కాదని సింగర్ మాళవిక అన్నారు. ఎస్పీబీకి కరోనా రావడానికి మాళవికనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమానికి బాలు హాజరు కాగా, అక్కడికి మాళవిక కూడా వెళ్లిందని.. అప్పటికే ఆమెకు కరోనా సోకినప్పటికీ నిర్లక్ష్యంగా అందులో పాల్గొని ఎస్పీబీకి కరోనా సోకేలా చేసిందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీటిపై స్పందించిన మాళవిక.. ఎస్పీబీకి కరోనా సోకడానికి తాను ఎంత మాత్రం కారణం కాదని స్పష్టం చేశారు.

ఓ పాటల కార్యక్రమానికి హాజరైన నేను వేరే గాయకులతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాను. కానీ ఎస్పీ బాలును కలవలేదు. ఎస్పీబీకి ఆగష్టు 5న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాకు 8న కరోనా సోకినట్లు తేలింది. కానీ కొంత మంది నాకు జూలైలోనే తనకు కరోనా వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వీటిపై సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాళవిక.. తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని అందులో వెల్లడించారు. కాగా కరోనా బారిన పడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఎస్పీబీ కోలుకొని రావాలంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Read More:

బాబుకు మరో షాక్‌.. బీజేపీలోకి వంగవీటి!

అత్యాచారం చేశారంటూ 139 మందిపై ఫిర్యాదు.. లిస్ట్‌లో యాంకర్ ప్రదీప్‌