AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shrihan: బెల్ట్‌తో కొట్టుకున్న శ్రీహాన్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన చైతూ. ఇంతకీ అసలేం జరిగిందంటే…

బిగ్‌బాస్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు స్వీట్‌ కపుల్‌ శ్రీహాన్‌, సిరి. బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో పాల్గొన్న సిరి ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో షణ్ముఖ్‌తో క్లోజ్‌గా మూవ్‌ కావడంతో శ్రీహాన్‌, సిరి విడిపోయారంటూ సోషల్‌ మీడియా కోడై కూసింది. ఈ జంట విడిపోయిందంటూ పెద్ద చర్చే జరిగింది...

Shrihan: బెల్ట్‌తో కొట్టుకున్న శ్రీహాన్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన చైతూ. ఇంతకీ అసలేం జరిగిందంటే...
Biggboss Fame Srihan
Narender Vaitla
|

Updated on: Jan 09, 2023 | 8:10 AM

Share

బిగ్‌బాస్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు స్వీట్‌ కపుల్‌ శ్రీహాన్‌, సిరి. బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో పాల్గొన్న సిరి ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో షణ్ముఖ్‌తో క్లోజ్‌గా మూవ్‌ కావడంతో శ్రీహాన్‌, సిరి విడిపోయారంటూ సోషల్‌ మీడియా కోడై కూసింది. ఈ జంట విడిపోయిందంటూ పెద్ద చర్చే జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఈ జంట తర్వాత క్లారిటీ ఇచ్చేసింది. ఇక బిగ్‌బాస్‌ 6వ సీజన్‌లో పాల్గొన్న శ్రీహాన్‌ సైతం సెలబ్రిటీ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కపుల్‌ లీవింగ్‌ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ చైతూ అనే ఆ కుర్రాడిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఒకేచోట కలిసి ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీహాన్‌ చైతూపై కొప్పడుతూ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. చెప్పిన మాట వినని చైతూను దారిల పెట్టాలనుకున్న శ్రీహాన్‌ తానను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. ‘ఎన్నిసార్లు చెప్పాలి.. నా మాట వింటావా? లేదా?’ అని బెల్ట్‌తో కొట్టుకున్నట్లు నటించాడు. దీంతో చైతూ ‘వింటా డాడీ, కొట్టుకోవద్దు.. సారీ’ అంటూ ఏడుస్తుండగా దీన్నంతటినీ సిరి వీడియో తీసింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలైంది. నెట్టింట వైరల్‌ అయిన ఈ వీడియోపై సింగర్‌ చిన్మయి స్పందించింది. శ్రీహాన్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘మనల్ని మనం దండించుకోవడం వల్ల పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. మనలో చాలా మంది పేరెట్స్‌ పిల్లలు చెప్పినట్లు వినకపోతే కొట్టుకోవడమో, చచ్చిపోతామనో బెదిరిస్తుంటారు. తాము చూసిన సంబంధాన్ని చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరిస్తారు. ఈ జనరేషన్‌లోనైనా దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి’ అంటూ వీడియోను షేర్‌ చేసింది చిన్మయి. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లేదో సరదాగా చేస్తే ఇంతెందుకు మేడమ్‌ అని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం చిన్మయికి మద్ధతుగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..