Shruti Haasan: శృతీహాసన్ గురించి నెటిజన్లు వెతుకుతోన్న ప్రశ్నలు ఇవే.. అమ్మడి సమాధానాలు ఏంటంటే..
Shruti Haasan: ఒకప్పడిలా కాదు ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒకప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే పుస్తకాల్లో వెతుక్కునే వారు, లేదంటే పక్కనున్న వారిని అడిగే వారు. కానీ ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లే. ఏ చిన్న సందేహం వచ్చినా..
Shruti Haasan: ఒకప్పడిలా కాదు ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒకప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే పుస్తకాల్లో వెతుక్కునే వారు, లేదంటే పక్కనున్న వారిని అడిగే వారు. కానీ ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లే. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే జేబులో నుంచి స్మార్ట్ ఫోన్‌ను తీసి గూగుల్‌లో వెతికేస్తున్నారు. అది, ఇది అనే తేడా లేకుండా అన్నింటి గురించి గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. సినిమావాల్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తమ అభిమాన తారల గురించి తెలుసుకోవాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి. అలా అభిమానులు గూగుల్‌లో తమ ఫేవరేట్ వ్యక్తుల కోసం శోధిస్తుంటారు.
నటీమణి శృతీ హాసన్ కోసం కూడా ఇలా నెట్టింట సెర్చ్ చేసే వారి సంఖ్య ఎక్కువే ఉందడి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ‘బెస్ట్ సెల్లర్’ అనే వెబ్‌సిరీస్‌తో డిజిటల్ ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. ఈ వెబ్ సిరీస్‌లో శృతీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా శృతీ హాసన్ ఇటీవల జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తన గురించి అభిమానులు గూగుల్‌లో వెతుకుతోన్న ప్రశ్నలను యాంకర్ ప్రస్తావించగా, ఫన్నీ సమాధానాలు చెప్పుకొచ్చిందీ అమ్మడు. ఇందులో భాగంగా శృతీ హాసన్ ఫోన్ నెంబర్ కోసం చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేశారని తెలపగా.. దానికి శృతీ స్పందిస్తూ.. ‘నా ఫోన్ నెంబర్ 100. ఈ సమాధానం ఇంతకు ముందు కూడా చెప్పాను’ అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. అయితే 100 పోలీస్‌లను సంప్రదించడానికి చేయాల్సిన నెంబర్ అనే విషయం మనకు తెలిసిందే.
ఇక రిలేషన్ స్టేటస్ గురించి కూడా నెటిజన్లను తెగ వెతికేస్తున్నారని ప్రశ్నిచంగా.. శృతీ స్పందిస్తూ ‘ఓహ్.. ఆ ప్రశ్న ఏంటో నాకు తెలుసు. నా బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారిక ఎవరనేగా.. దీన్ని నేనూ గూగుల్ చేశాను. అక్కడ కనిపించిన మిగతా ప్రశ్నలను చూసి తెగ నవ్వుకున్నాను. ఇంతకీ నా ఆన్సరేంటంటే, అవును, నేను డేటింగ్ చేస్తున్నాను’ అని చెప్పేసింది. ఇక శృతీ హాసన్ ఆస్తి ఎంత అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘దాన్ని కనుగొనే పనిలోనే ఉన్నాను, కానీ తను అదింకా పెరగాలనుకుంటున్నాను’ అని బదులిచ్చింది. ఇదిలా ఉంటే తెలుగు చాలా రోజుల నుంచి గ్యాప్ ఇచ్చిన శృతీ హాసన్ తాజాగా ప్రభాస్ సరసన, సలార్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.